Varanasi Update : మహేష్ బాబు 'వారణాసి' బిగ్ అప్డేట్ - మ్యూజిక్ వర్క్స్‌పై కీరవాణి ఏమన్నారంటే?
Varanasi Movie : మహేష్ బాబు 'వారణాసి'పై మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... మ్యూజిక్ వర్క్స్‌పై ఆస్కార్ విన్నర్ కీరవాణి స్పందించారు.

Keeravani About Mahesh Babu Varanasi Music Work : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ 'వారణాసి'. ఈ విజువల్ వండర్‌పై రోజు రోజుకూ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... తాజాగా ఆయన బీజీఎం వర్క్స్‌పై అప్డేట్ ఇచ్చారు.
ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే?
అటు కెన్యా నుంచి ఇటు హైదరాబాద్ వరకూ 'వారణాసి' షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం జార్జియాలో న్యూ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి కాగా... కీలకమైన రామాయణం షెడ్యూల్ పూర్తైనట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా బీజీఎం వర్క్స్ ఈ సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు కీరవాణి.
ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌లో మహేష్ లుక్‌తో పాటు అద్భుతమైన విజువల్స్ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. మైథలాజికల్ ఎపిక్ 'రామాయణం'లో కీలక ఘట్టాన్ని టచ్ చేసేలా సీన్స్, బీజీఎం వేరే లెవల్. ప్రపంచ సంచారిగా రుద్రుడి పాత్రలో మహేష్ కనిపించనుండగా... సంచారి సాంగ్, విలన్ 'రణ కుంభ' రోల్ ఎలివేట్ చేసేలా 'ప్రళయం ప్రళయం దుష్కృత వలయం...' అంటూ సాగే సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
Also Read : యశ్ 'టాక్సిక్' టీజర్ డేట్, టైం ఫిక్స్ - వెయిటింగ్ ఫర్ బిగ్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్
మొత్తం ఎన్ని పాటలంటే?
'వారణాసి'లో ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మొత్తం 6 పాటలుంటాయని ఇదివరకే చెప్పారు కీరవాణి. అద్భుతమైన విజువల్స్‌కు గొప్ప బీజీఎం ఉంటుందని... ఇంతకు ముందు ఆడియన్స్ ఎవరూ ఎక్స్‌పీరియన్స్ చేయని మ్యూజిక్ ఉండబోతోందంటూ హైప్ ఇచ్చారు. భారీ ప్రాజెక్టులో టైటిల్ సాంగ్‌తో పాటు 'మందాకిని' రోల్‌కు సంబంధించి సాంగ్స్ కోసం అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెం.1 నుంచి మొన్నటి 'RRR' వరకూ కీరవాణే మ్యూజిక్ అందించారు. 'RRR'లో నాటు నాటు పాటకు ఆయన్ను ఆస్కార్ అవార్డ్ వరించింది.
కీ రోల్‌లో కన్నడ స్టార్
ఈ మూవీలో కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌ను తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక రుద్రుడిగా మహేష్ బాబు, మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ రణ కుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శివ భక్తుడిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. మరి కిచ్చా సుదీప్ రోల్ ఏంటి అనేదే ఆసక్తిగా మారింది. ఈ జూన్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత VFX పనులు ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ రన్ టైం 3 గంటలకు పైగా ఉంటుందని... ఒకే పార్టులో మూవీ తీయనున్నట్లు చెప్పారు రాజమౌళి. మైథాలజీ పార్ట్ 25 నిమిషాలు ఉంటుందని... రుద్రుడు, శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపించనున్నట్లు తెలిపారు. రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కుతుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
























