Thamma First Review Telugu: థామా ఫస్ట్ రివ్యూ... బాలీవుడ్‌లో రష్మిక హారర్ కామెడీ... సినిమా హిట్టా? ఫట్టా? ప్రీమియర్స్ టాక్ ఏమిటంటే?
Thamma Review Telugu: రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ బాలీవుడ్ సినిమా 'థామా'. హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరో. ముంబైలో ప్రీమియర్స్ పడ్డాయి. టాక్ ఏమిటంటే?

Rashmika Mandanna's Thamma Movie Review In Telugu: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'థామా'. ఇదొక హారర్ కామెడీ. 'మ్యాడ్‌డాక్ హారర్ కామెడీ యూనివర్స్'లో ఐదో సినిమా. స్త్రీ, బేడియా, ముంజ్యా, స్త్రీ 2 తర్వాత వచ్చిన సినిమా. అక్టోబర్ 21న రిలీజ్. అయితే ముంబైలో ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా టాక్ ఏంటి? ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది? అనేది చూడండి.
జానపద బేతాళుడి కథలతో...
బేతాళుడి కథలను భారతీయులు కొన్నేళ్లుగా వింటున్నారు. భారత జానపదాల్లో ఆ బేతాళ కథలు భాగం. వాటి స్ఫూర్తితో 'థామా' సినిమా తీశారట. ముంజ్యా తర్వాత దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ మరొక మాంచి కామెడీ హారర్ ప్రేక్షకులకు అందించారని చెప్పుకొచ్చారు ముంబైలో ప్రీమియర్స్ చూసిన క్రిటిక్స్. ఫస్టాఫ్ చకచకగా సాగిందని, అయితే ఇంటర్వెల్ తర్వాత కొంత డౌన్ అయ్యిందని ఫస్ట్ రిపోర్ట్స్ అందాయి.
'థామా'కు అసలైన బలం వన్ లైనర్ పంచ్ డైలాగులే అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. వాటి వల్ల మంచి ఫన్ వర్కవుట్ అయ్యిందట. ఆ తర్వాత తెలివిగా రివీల్ చేసిన ట్విస్టులు అంటున్నారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం సైతం చాలా బావుందట. అతిథి పాత్రలో ఒక ప్రామినెంట్ యాక్టర్ చేశారట. అతను ఎవరు అనేది సినిమాలో చూడాలి. ఆ యాక్టర్ ఎంట్రీ తర్వాత వచ్చే యాక్షన్ సీన్ సూపర్ ఉంటుందట.
రష్మిక మందన్నా సర్‌ప్రైజ్!
'థామా'లో సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న మహిళ పాత్రలో రష్మిక నటించింది. ఆమె ద్వారా హీరోకి పవర్స్ వస్తాయి. ఆమెను దెయ్యం అని చెప్పలేం. ప్రజలకు మేలు చేయాలని తపించే ఒక మంచి ఆత్మ అన్నమాట. ఆ పాత్రలో రష్మిక నటన సర్‌ప్రైజ్ చేస్తుందట. ఒకవైపు గ్లామర్‌గా కనిపిస్తూ మరొక వైపు నటనలోనూ ఆమె తన ట్యాలెంట్ చూపించారని ముంబైలో సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. కెరీర్ పరంగా ఛాలెంజింగ్ రోల్స్ ఎంపిక చేసుకుంటున్నారని, అందులో అద్భుతంగా నటించారని ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చింది.
Also Read: శివంగిలా సన్నీ లియోన్... 'త్రిముఖ' సినిమాలో రోల్ అదే - టీజర్ చూశారా?
భయపెట్టడంతో పాటు ప్రేక్షకులను చక్కగా నవ్వించారని ఆయుష్మాన్ ఖురానా నటన గురించి రిపోర్ట్స్ వచ్చాయి. పర్ఫెక్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని ఆయనను అప్రిషియేట్ చేశారు. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారని, ఆయన నటన పలు సన్నివేశాలను అద్భుతంగా మార్చిందని హిందీ క్రిటిక్స్ పేర్కొన్నారు. పరేష్ రావల్ సైతం అద్భుతంగా నటించారట. ఆయన కామెడీ టైమింగ్ వల్ల నటించిన ప్రతి సీన్ పేలిందట.
Also Read: టాలీవుడ్ పెద్దలకు బండ్ల గణేష్ దివాళీ పార్టీ - ఖర్చు ఎంతో తెలుసా?
టెర్రిఫిక్... 4 స్టార్ రేటింగ్!
Taran Adarsh reviews Thamma: బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ అయితే 'థామా'ను టెర్రిఫిక్ సినిమా అని పేర్కొన్నారు. దీనికి ఆయన 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ఖాతాలో మరొక హిట్ సినిమా పడిందని చెప్పారు.
#OneWordReview...#Thamma: TERRIFIC.
— taran adarsh (@taran_adarsh) October 19, 2025
Rating: ⭐⭐⭐⭐️#MaddockFilms delivers yet another winner… A delicious cocktail of humour, supernatural, and romance... Takes a completely uncharted path as far as the plot goes… EXPECT THE UNEXPECTED! #ThammaReview
Director… pic.twitter.com/hkMow8xkXt





















