Teja Sajja - Rana Daggubati: ఐఫాలో కాంట్రవర్సీకి చెక్ పెట్టిన తేజా సజ్జ, రానా... ఇప్పుడైనా ట్రోల్స్ ఆపేస్తారా?
రీసెంట్ గా జరిగిన ‘ఐఫా’ అవార్డుల వేడుకలో రానా, తేజ సజ్జ హోస్టులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం అయ్యాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై ఇద్దరూ వివరణ ఇచ్చారు.
Rana Daggubati and Teja Sajja About IIFA Controversy: సెప్టెంబర్ లో అబుదబి వేదికగా ‘ఐఫా’ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు సినీ ప్రముఖులంతా పాల్గొని సందడి చేశారు. ఈ ఈవెంట్ కు రానా దగ్గుబాటి, తేజ సజ్జ హోస్టులుగా వ్యవహరించారు. స్టేజి మీద వాళ్లు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ క్లారిటీ ఇచ్చారు. తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు.
ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం లేదు- తేజ సజ్జా
‘ఐఫా’ వేడుకలో తాను ఎవరినీ కించపరిచే ప్రయత్నం చేయలేదన్నారు తేజ సజ్జ. “ఐఫా’ వేడుకలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఎందో మంది స్క్రిప్ట్ రైటర్లు దీని కోసం పని చేస్తారు. అన్ని విషయాలను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు ఇస్తారు. ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియోలు అన్నీ కట్ చేసిన క్లిప్స్. పూర్తి వీడియో చూస్తే ఎలాంటి వివాదం ఉండదు. రానా నా మీద జోక్స్ వేశారని అందరికీ అర్థం అయ్యింది. అందరూ వాటిని జోక్ గానే చూశారు. చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అందరు హీరోలతో కలిసి పని చేస్తూ పెరిగాను. వారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇతరులను తక్కువ చేసి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. లేదు. ఆ ఆలోచన కూడా రాదు. మా కామెంట్స్ ను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అపార్థం చేసుకుంటున్నారు” అని తేజ సజ్జ చెప్పుకొచ్చారు.
Teja Clarity on IIFA Controversy 👍 pic.twitter.com/QRXVr7Ax6H
— Johnnie Walker🚁 (@Johnnie5ir) November 15, 2024
ఇది జోక్ అని సబ్ టైటిల్ వేద్దాం- రానా
అటు ఈ వివాదంపై నటుడు రానా కూడా స్పందించారు. ‘‘నాని నాకొక సలహా ఇచ్చారు. నెక్స్ట్ టైమ్ నుంచి నువ్వు జోక్స్ వేసినప్పుడు... అది జోక్ అని తెలిసినట్లు వెయ్. లేకపోతే ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది జోక్... అందరూ నవ్వండి అని నెక్స్ట్ టైమ్ నుంచి ఒక సబ్ టైటిల్ వేద్దామనుకుంటున్నా’’ అని వెల్లడించారు.
‘ఐఫా’ వేడుకలో ఏం జరిగిందంటే?
సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఐఫా’ అవార్డుల వేడుక సెప్టెంబర్ లో అబుదబి వేదికగా అట్టహాసంగా జరిగింది. దేశ వ్యాప్తంగా పలు సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. తెలుగు సినిమా అవార్డుల వేడుకకు టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, తేజ సజ్జ హోస్టులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, సినిమాల గురించి ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. కొంత మంది దర్శకులు కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రానా, సజ్జ క్లారిటీ ఇచ్చారు.
Read Also: తమిళ సినిమా పరిశ్రమలో విషాదం... లివర్ సంబంధిత సమస్యలతో యంగ్ డైరెక్టర్ మృతి