Manjummel Boys: తమిళనాడు పోలీసులను చిక్కుల్లో పడేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ - 18 ఏళ్ల తర్వాత ఆ కేసు రీ ఓపెన్
‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ దెబ్బకు 18 ఏండ్ల నాటి కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. 2006లో కొడైకెనాల్ లో జరిగిన ఘటనపై విచారణ మొదలయ్యింది. ఈమేరకు తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
![Manjummel Boys: తమిళనాడు పోలీసులను చిక్కుల్లో పడేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ - 18 ఏళ్ల తర్వాత ఆ కేసు రీ ఓపెన్ Tamil Nadu govt orders probe on cops who misbehaved with real Manjummel Boys after 18 years Manjummel Boys: తమిళనాడు పోలీసులను చిక్కుల్లో పడేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ - 18 ఏళ్ల తర్వాత ఆ కేసు రీ ఓపెన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/10/13df21d8d1f30070917a2e00889eff201715328168814544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TN Govt Orders Probe On Cops Who Misbehaved With Real Manjummel Boys: వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’. చిందబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో ఈ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్లు వసూళు చేసింది. మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఇంతకీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ కథ ఏంటంటే?
కేరళకు చెందిన కొందరు స్నేహితులు కొడైకెనాల్ టూర్ కు వెళ్తారు. అక్కడ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత గుణ గుహలు చూసేందుకు వెళ్తారు. అక్కడ గుహల్లో ఈ ఫ్రెండ్స్‌లో ఒకరు పడిపోతాడు. అతడిని బయటకు తీసుకొచ్చేందుకు మిగతా ఫ్రెండ్స్ ప్రయత్నిస్తారు. ఆ గుహలో పడిపోయిన వాళ్లు ఇప్పటి వరకు ఎవరూ బతికి బయటపడలేదని చెప్తారు. శవం కాదు కదా, కనీసం ఎముకలు కూడా దొరకలేదని చెప్తారు. అయిన, తన స్నేహితుడిని కాపాడుకునేందుకు తోటి మిత్రులు చేసే ప్రయత్నాన్ని హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు.
‘మంజుమ్మెల్ బాయ్స్’తో పోలీసులకు కొత్త తలనొప్పి
‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమా తమిళనాడు పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. 2006లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంలో తెరకెక్కిన ఈ సినిమా తెరకెక్కింది. ఈ నేపథ్యంలో పాత కేసుపై మళ్లీ విచారణ జరపాలని తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాకు, ఈ కేసు దర్యాప్తునకు కారణం ఏంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సినిమాలో టూర్‌కు వచ్చిన యువకులలో ఒకరు గుహలో పడిపోగానే, తమ స్నేహితుడిని కాపాడాలని పోలీసులను కోరుతారు.
అయితే, వారి పట్ల తమిళ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యహరిస్తారు. కనీసం అతడు బతికి ఉన్నాడో? లేడో? తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే తను బతికి ఉండే సమస్యే లేదంటూ మిగతా మిత్రులను భయపెడతారు. అయితే, నాటి పోలీసులు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటారని కోయంబత్తూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు వి షిజు అబ్రహం అభిప్రాయపడ్డారు. అప్పటి ఘటనపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తమిళ ప్రభుత్వం సదరు ఘటనపై విచారణ జరపాలని ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
2006లో ఏం జరిగిందంటే?
2006లో కొచ్చిలోని ఒక గ్రామానికి చెందిన 11 మంది యువకులు కొడైకెనాల్ కు టూర్‌కు వెళ్లారు. సినిమాలో చూపించినట్లుగా ఓ అబ్బాయి ’గుణ‘ గుహల్లోని ఓ లోయలో పడిపోయాడు. మిగతా స్నేహితులు కొడైకెనాల్ పోలీసులు సాయం కోరారు. అప్పుడు కూడా పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారనే విమర్శలు ఉన్నాయి. ‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమా చూశాక తనకు పోలీసు తీరుపై తీవ్ర ఆగ్రహం కలిగిందని షిజు తెలిపారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకునే పోలీసులు సాయం చేయకుండా హేళన చేయడం బాధాకరమన్నారు. అందుకే పోలీసులు తీరుపై విచారణ జరపాలని కోరారు. షిజు ఫిర్యాదు మేరకు, తమిళనాడు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి కెవి ప్రసాద్ ఆ రాష్ట్ర డీజీపీ శంకర్ జివాల్‌కు ఆదేశాలు జారీ చేశారు. 2006 ఘటనపై విచారణ జరపాలన్నారు.
Read Also: అలాంటి రొమాన్స్ ఫస్ట్ టైమ్ చేశా - ఒంటి మీద దుద్దుర్లు వచ్చాయి: ‘హీరామండి’బ్యూటీ శృతి శర్మ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)