Taapsee's Mishan Impossible Release Date: ఏప్రిల్‌లో తాప్సీ తెలుగు మిషన్
Taapsee Pannu's Mishan Impossible Movie Release date: తాప్సీ పన్ను మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొంత విరామం తర్వాత ఆమె నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా విడుదలకు సిద్ధమైంది.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో స్వరూప్ ఆర్.ఎస్.జె తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి తాప్సీ పన్ను అంగీకరించిన సంగతి తెలిసిందే. అదే 'మిషన్ ఇంపాజిబుల్'. ఒకవైపు 'ఆచార్య' వంటి భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కొత్త తరహా సినిమాలను నిర్మించే మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలియజేసింది.
వేసవి కానుకగా ఏప్రిల్ 1న 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు మహాశివరాత్రి సందర్భంగా వెల్లడించారు. తాప్సీతో పాటు సినిమాలో మరో ముగ్గురు బాలలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల సినిమా నుంచి 'ఏద్దాం గాలం...' లిరికల్ వీడియో విడుదల చేశారు. తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో సినిమా రూపొందించినట్టు చిత్ర బృందం పేర్కొంది.
Also Read: ప్రజలకు నచ్చేలా కాదు, నిజాన్ని చేర్చేలా ఉండాలి! - 'మారన్'లో ధనుష్ ఏం చెప్పాడు? ఏం చేస్తున్నాడు?
రవీందర్ విజయ్, హరీష్ పరేది తదితరులు నటించిన ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తుండగా... ఎన్.ఎం. పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా, సంగీతం: మార్క్ కె రాబిన్. ఎడిటర్ రవితేజ గిరిజాల.
Also Read: తెలుగులోనూ కంగనా రనౌత్ 'ధాకడ్' - వేసవిలో విడుదలకు రెడీ! కొత్త రిలీజ్ డేట్ ఇదిగో
View this post on Instagram