Kangana Ranaut's Dhaakad New Release Date: తెలుగులోనూ కంగనా రనౌత్ 'ధాకడ్' - వేసవిలో విడుదలకు రెడీ! కొత్త రిలీజ్ డేట్ ఇదిగో
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ 'ధాకడ్' తెలుగులోనూ విడుదల కానుంది. ఈ రోజు కొత్త విడుదల తేదీ ప్రకటించారు.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధాకడ్'. ఓ హీరోయిన్‌తో ఇండియాలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ ఇదేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిని ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు వాయిదా పడింది. మే 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం... మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమాగా 'ధాకడ్'ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. జయలలిత బయోపిక్ 'తలైవి' తర్వాత తమిళనాడులో కంగనాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు హిందీ సినిమా ఇండస్ట్రీలో ఇతర ప్రముఖులు, సినిమాలపై చేసే కామెంట్స్ ద్వారా ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అందువల్ల, ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సో... ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ లభిస్తుంది. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: అది పోర్న్ సినిమా అంటున్న కంగనా రనౌత్? దీపికా పదుకోన్ స్కిన్ షో సేవ్ చేయలేదని కామెంట్!
కంగనా రనౌత్ కాకుండా ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా, స్వస్థ ఛటర్జీ తదితరులు నటించారు. ఏజెంట్ అగ్ని పాత్రలో కంగనా రనౌత్ కనిపించనున్నారు. ఆమె హోస్ట్ చేస్తున్న 'లాక్ అప్' షో ఎంఎక్స్ ప్లేయర్, ఆల్ట్ బాలాజీ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: కంగనా రనౌత్ 'లాక్ అప్' షో మీద హైదరాబాద్ కోర్టు స్టే ఆర్డర్
View this post on Instagram