By: ABP Desam | Updated at : 13 Feb 2022 07:53 AM (IST)
కంగనా రనౌత్, దీపికా పదుకోన్
'గెహరాయియా' విడుదలకు ముందు ప్రచార చిత్రాల్లో ముద్దు ముచ్చట గురించి పెద్ద చర్చ జరిగింది. విడుదలైన తర్వాత సినిమాలో దీపికా పదుకోన్ (Deepika Padukone performance lauded by bollywood celebs) అభినయం అద్భుతమంటూ హిందీ చలన చిత్ర ప్రముఖులు, ప్రేక్షకులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. విమర్శకులకూ సినిమా నచ్చింది. అదే సమయంలో సినిమాపై మిశ్రమ స్పందన కూడా వ్యక్తం అవుతోంది. ప్రముఖ హిందీ కథానాయిక కంగనా రనౌత్ (Kangana Ranaut) కు 'గెహరాయియా' నచ్చలేదు. దాంతో పరోక్షంగా సినిమాపై విమర్శలు గుప్పించారు.
"నేనూ ఈతరం అమ్మాయినే. అయితే, ఇటువంటి రొమాన్స్‌ను నేను అర్థం చేసుకుంటాను. గుర్తిస్తాను. దయచేసి అర్బన్ మూవీస్, న్యూ ఏజ్ సినిమా, మిలీనియల్ అంటూ చెత్తను అమ్ముకోవద్దు. చెత్త సినిమాలు ఎప్పటికీ చెత్త సినిమాలే. ఎంత స్కిన్ షో చేసినా, పోర్నోగ్రఫీ పెట్టినా వాటిని సేవ్ చేయలేరు (Kangana Ranaut says Skin Show Can not Save A Bad Movie). ఇది బేసిక్ ఫ్యాక్ట్. ఇందులో నిగూఢ అర్థాలు ఏమీ లేవు" అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కంగనా రనౌత్ పేర్కొన్నారు. మనోజ్ కుమార్ హీరోగా నటించిన 'హిమాలయ కీ గోద్ మే' సినిమాలో 'చాంద్ కి మెహబూబా' పాటను పోస్ట్ చేశారు.
Also Read: 'గెహరాయియా' రివ్యూ: ఆ ఒక్క రొమాంటిక్ మిస్టేక్ కంటే జీవితం పెద్దది!
కంగనా రనౌత్ నుంచి వచ్చిన ఈ పోస్ట్ చూసి బాలీవుడ్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే... 'గెహరాయియా' సినిమాను కరణ్ జోహార్ నిర్మించారు. కంగనా, కరణ్ మధ్య సత్సంబంధాలు లేవు. ఆయనపై గతంలోనూ ఆమె విమర్శలు చేశారు. అయితే... ఈసారి 'గెహరాయియా'ను అశ్లీల చిత్రాలతో పోల్చడం గమనార్హం.
Also Read: దీపికా పదుకోన్ కట్ అవుట్ డ్రస్ కాస్ట్ అంతా?
Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై సమంత కామెంట్
Naresh Pavithra Lokesh: మా అత్తగారి డైమండ్ నెక్లెస్ పవిత్ర దగ్గరే ఉంది, నరేష్ మూడో భార్య రమ్య ఆరోపణలు
Naresh and Pavithra Lokesh: మైసూరు హోటల్లో నరేష్, పవిత్ర - చెప్పుతో కొట్టబోయిన మూడో భార్య రమ్య
Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత
Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్‌లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్
Watch Video: దటీజ్ ఇండియన్ ఆర్మీ - అమర్నాథ్ యాత్రికుల కోసం 4 గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం
Software Engineer Suicide: జాబ్‌లో జాయినింగ్ అని హైదరాబాద్ బయలుదేరిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ - తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్
Hyderabad Metro: బీజేపీ సభ ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం, ఈ స్టేషన్లు క్లోజ్ - ఇక్కడ మెట్రోరైళ్లు ఆగవు
World Biryani Day: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే