Kangana Ranaut's 'Lock Upp' Controversy: కంగనా రనౌత్ 'లాక్ అప్' షో మీద హైదరాబాద్ కోర్టు స్టే ఆర్డర్
కంగనా రనౌత్ హోస్ట్ చేయనున్న 'లాప్ అప్' షో మీద హైదరాబాద్ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
కంగనా రనౌత్ హోస్ట్‌గా ప్రముఖ హిందీ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన షో 'లాక్ అప్'. ఫిబ్రవరి 27న (ఈ ఆదివారం) ఓటీటీలో విడుదల కానుంది. విడుదలకు కొన్ని గంటలు మాత్రమే ఉందని అనగా... ఈ షో చిక్కుల్లో పడింది. హైదరాబాద్ సివిల్ కోర్టు ఈ షో మీద స్టే విధించింది. సనోబర్ బైగ్ అనే వ్యక్తి వేసిన పిటీషన్‌ను విచారించిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తాను రూపొందించిన 'ద జైల్' షో కాన్సెప్ట్ ఆధారంగా 'లాక్ అప్' రూపొందించారని... ఒరిజినల్ షో సృష్టికర్త తాను అని అతను పేర్కొన్నారు. తన ఐడియా కంగనా రనౌత్ షో నిర్వాహకులు కాపీ కొట్టారని అన్నారు.
Also Read: అది పోర్న్ సినిమా అంటున్న కంగనా రనౌత్? దీపికా పదుకోన్ స్కిన్ షో సేవ్ చేయలేదని కామెంట్!
'లాక్ అప్'లో మునావర్ ఫరూఖీ, పూనమ్ పాండే, బబితా ఫోగట్ కరణ్ వీర్ బొహ్ర తదితరులు కంటెస్టెంట్లు. కోర్టు స్టే విధించిన నేపథ్యంలో రేపటి నుంచి (ఫిబ్రవరి 27, ఆదివారం) షో టెలికాస్ట్ అవుతుందో? లేదో? చూడాలి.
Also Read: అల్లు అర్జున్, యష్ లకు కంగనా సలహా.. బాలీవుడ్ వలలో పడొద్దంటూ రిక్వెస్ట్..
View this post on Instagram
View this post on Instagram