Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్ - అప్పుడే మరో స్టార్ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ఆసక్తి పెంచుతున్న పోస్టర్
Suriya Next Movie: అప్పుడే సూర్య మరో సినిమా లైన్లో పెట్టాడు. ఇప్పటికే చేతి పలు ప్రాజెక్ట్స్ పెట్టుకున్న సూర్య తన 44 మూవీ కోసం క్రేజీ డ్రైరెక్టర్‌తో జతకట్టాడు. ఆయన ఎవరంటే..
Suriya Next Movie With Karthik Subbaraju: తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫలితం సంబంధం లేకుండ వరుసగా ప్రాజెక్ట్స్ చేసుకుంటుపోతున్నాడు. వైవిధ్యమై కథ, విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన సూర్య ప్రస్తుతం శివ్ దర్శకత్వంలో 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగరతో 'సూర్య43' చేయబోతున్నాడు. ఇప్పటికే సినిమా సంబంధించి చర్చలు, ఒప్పందాలు కూడా అయిపోయాయి. కంగువ షూటింగ్ అయిపోగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలేక్కించే పనిలో ఉన్నారు మేకర్స్. ఒక మూవీ సెట్‌పై మరో మూవీ లైన్లో ఉండగా తాజాగా మరో సినిమాకు కమిట్ అయ్యాడు సూర్య.
సూర్య 44(Suriya 44) అప్డేట్
Karthik Subbaraju and Karthik Subbaraju Movie: ప్రముఖ తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఒకే చేశాడట. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. స్వయంగా కార్తీక్ సుబ్బరాజు, సూర్యలే ఈ మూవీపై ప్రకటన ఇచ్చారు. "నా తదుపరి సినిమా ఎవర్ ఆసమ్ సూర్యతో చేస్తున్నాను. సూర్య44 కోసం మేమిద్దరం కలిశాం" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు కార్తీక్ సుబ్బారాజు. 'న్యూ బిగినింగ్.. మీ ఆశీర్వాదాలు కావాలి' అంటూ సింపుల్ గా కొత్త సినిమాను ప్రకటించేశాడు. అంతేకాదు ఈ మూవీ పోస్టర్‌ను కూడా పంచుకున్నాడు. 'సూర్య 44' (Suriya 44)అని ఓ చెట్టుపై రాసి ఉన్న వర్కింగ్ టైటిల్‌ను వదిలాడు. అయితే ఈ పోస్టర్‌లొ బ్యాక్‌డ్రౌండ్ మొత్తం ఎర్రటి మంటలతో ఉండటం ఆసక్తిని రేపుతుంది. ఇది ఏదో హారర్ జానర్‌లా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మొత్తానికి ఈక్రేజీ కాంబోలో మూవీ అనగా సూర్య ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఇది తెలిసి కోలీవుడ్ మూవీ లవర్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇద్దరు క్రేజీ పీపుల్స్ కలిస్తే ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందా అని అంచనాలు వేసుకుంటున్నారు. ఇటీవల కార్తీక్ సుబ్బారాజ్ కామెడీ అండ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ 'జిగర్ తండా డబుల్ ఎక్స్'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారట.
Also Read: సాలీడ్ అప్‌డేట్, 'పుష్ప 3' టైటిల్ వచ్చేసింది? - సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా..
View this post on Instagram