Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్, 'పుష్ప 3' టైటిల్ వచ్చేసింది? - సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా..
Pushpa 3 Title: తాజాగా అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప 3 టైటిల్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వార్త చూసి బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Allu Arjun Pushpa 3 Title Out: టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో 'పుష్ప: ది రూల్' (Pushpa 2) ఒకటి. అల్లు అర్జున్ హీరో సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా విపరీతమైన బజ్ ఉంది. బన్నీ క్రేజ్‌ను ఇంటర్నేషన్ లెవల్‌కు తీసుకు వెళ్లిన ఈ మూవీ 2021 విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ మూవీతోనే మన స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ అయ్యాడు. 'పుష్ప: ది రైజ్' పేరుతో ఫస్ట్ పార్ట్ విడుదలవగా.. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప: ది రూల్' రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమా ఆగస్ట్‌లో రిలీజ్‌కు కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం.
ఈ క్రమంలో ఈ మూవీ నుంచి రోజుకో అప్‌డేట్స్ బయటకు వస్తూ మరింత హైప్ పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉండోచ్చని అల్లు అర్జున్ హింట్ ఇచ్చాడు. అప్పటి నుంచి పుష్ప: పార్ట్ 3పై తరచూ ఏదోక వార్త బయటకు వస్తుంది. తాజాగా పుష్ప 3కి టైటిల్ ఇదేనంటూ తాజాగా ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. మూడో పార్ట్ కు 'పుష్ప: ది రోర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్‌లో నిలిచింది. డైరెక్టర్ సుకుమార్ అండ్ టీం పార్ట్ 3కి 'పుష్ప: ది రోర్' అనే టైటిల్ అనుకుంటున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'పుష్ప: ది రైజ్'లో పుష్పరాజ్‌ని పరిచయం అయితే.. రెండవ పార్ట్ 'పుష్ప: ది రూల్'తో అల్లు అర్జున్ గ్రేస్ కనిపిస్తుంది.. పార్ట్‌లో 'పుష్ప: ది రోర్' మూవీ ముగుస్తుందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా, ఇటీవల 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప 3 ఉంటుందని ఇన్‌డైరెక్టగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ ఇంగ్లీష్ చానల్‌తో ముచ్చిటస్తూ.. మేం ‘పుష్ప’ను ఓ ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నామని, సీక్వెల్స్ కోసం డైరెక్టర్ సుకుమార్ దగ్గర చక్కటి ఆలోచనలున్నాయి. ఇప్పటికే 'పుష్ప 3'పై తను డైరెక్టర్ సుకుమార్ ఓ సారి చర్చించినట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ‘పుష్ప3’ ఆశించడంలో ఏమాత్రం సందేహం కూడా అవసరం లేదని మరి నొక్కి చెప్పాడు. దీంతో అంతా 'పుష్ప 3' రావడం పక్కా అని డిసైడ్ అయిపోయారు. ఈనేపథ్యంలో తాజాగా పార్ట్ ౩ టైటిల్ ఇదేనంటూ వార్త బయటకు వచ్చింది. మరీ దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
అప్పుడే టైటిల్, పార్ట్ 3పై క్లారిటీ!
అయితే ఇది 'పుష్ప: ది రూల్' సినిమా థియేటర్లోనే పార్ట్ 3పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య దర్శకుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మూవీకి సీక్వెల్‌ను ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లోనే థియేటర్లోనే రివీల్ చేస్తున్నారు. రీసెంట్‌గా హనుమాన్‌కి సీక్వెల్ ఉంటుందని తెలపడం కాదు..ఏకంగా టైటిలే అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు పుష్ప కూడా సుకుమార్ అదే ఫాలో అవుతాడేమో అంటున్నారు. పుష్ప పార్ట్ 2 రిలీజ్ అయిన థియేటర్లోనే ఎండింగ్‌లోనే ఈ మూవీ పార్ట్ 3, టైటిల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరి పుష్ప పార్ట్ 3 ఉంటుందా? లేదా? అనేది తెలియాలంటే రెండో పార్ట్ రిలీజ్ వరకు వేయిట్ చేయాల్సిందే.