అన్వేషించండి

Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

Allu Arjun: అల్లు అర్జున్‌ ప్రౌడ్‌ మూమెంట్‌లో ఉన్నాడు. దుబాయ్‌ అతడు అరుదైన ఘనత అందుకున్న సంగతి తెలిసిందే. పుష్పతో వచ్చిన క్రేజ్‌ నేపథ్యంలో దుబాయ్‌లో బన్నీ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరించారు.

Allu Arjun Shared Photos With His Wax statue: అల్లు అర్జున్‌ ప్రస్తుతం దుబాయ్‌ వెకేషన్‌లో ఉన్న సం ఆవగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీతో కలిసి బన్నీ దుబాయ్‌కి పయనమయ్యాడు. అయితే ఈ వెకేషన్‌ మాత్రం బన్నీకి, అల్లు ఫ్యాన్స్‌కి మాత్రం చాలా స్పెషల్‌ అని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్‌కి ఈసారి దుబాయ్‌ అరుదైన గౌరవం లభించింది. 'పుష్ప: ది రైజ్‌'తో ఐకాన్ స్టార్‌ అయిన బన్నీ.. ఎన్నో రికార్డులు, అవార్డు అందుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో వరల్డ్‌ ఫేమస్‌ అయిన బన్నీకి తాజాగా దుబాయ్‌లో అరుదైన ఘనత దక్కింది.అక్కడి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ వ్యాక్స్‌ స్టాట్చ్యూ (మైనపు విగ్రహం) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే అల్లు అర్జున్‌ దుబాయ్‌ వెళ్లి స్వయంగా తన వ్యాక్స్‌ విగ్రహన్ని ఆవిష్కరించడం విశేషం. నిన్న(మార్చి 28) రాత్రి 8 గంటలకు ఈ విగ్రహం ఆవిష్కరణ జరగింది. దీనికి స్పెషల్‌ గెస్ట్‌గా వెళ్లిన బన్నీ స్వయంగా తన విగ్రాహన్ని ఆవిష్కరించడమే కాదు దానితో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా తన వ్యాక్స్‌ స్టాట్చ్యూతో కలిసి దిగిన ఫోటోలను బన్నీ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు.

'ఇది ప్రతి నటుడి మైల్ స్టోన్ మూమెంట్'

"ఈ రోజు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో 'వ్యాక్స్‌ స్టాట్చ్యూ' ఆవిష్కరణ జరిగింది. ఇది ప్రతి నటుడికి ఇది మైల్‌స్టోన్‌ మూమెంట్‌. ఇదో గొప్పు అనుభూతి" అంటూ బన్నీ తన స్పెషల్‌ మూమెంట్‌ని షేర్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి పోస్ట్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఇది చూసి మెగా-అల్లు ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. ఇక దుబాయ్‌లో ఓ తెలుగు యాక్టర్‌గా అత్యంత గౌరవం పొందిన తొలి టాలీవుడ్‌ హీరోగా బన్నీ రికార్డు ఎక్కాడు. ఇదిలా ఉంటే గతేడాది నుంచి అల్లు అర్జున్‌ వరుసగా రికార్డు మీద రికార్డులు కొడుతున్నాడు.Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

'పుష్ప: ది రైజ్‌'తో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు బన్నీ. ఈ సినిమాకు గానూ నేషనల్‌ అవార్డు అందుకు తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ అత్యధిక ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న సౌత్‌ హీరోల్లో బన్నీదే టాప్‌ ప్లేస్‌. తెలుగులోనే కాదు తమిళ్‌, కన్నడ, మలయాళం ఇలా సౌత్‌లో అందరికంటే ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు తాజాగా దుబాయ్‌లో తన మైనపు విగ్రహ ఆవిష్కరణతో మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇలా అల్లు అర్జున్‌ బ్యాక్ టూ బ్యాక్ రికార్డు, ఘనతలు అందుకోవడం చూసి ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంతా తెగ మురిసిపోతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget