Suriya Daughter Diya 10th Marks: పదో తరగతిలో సత్తా చాటిన సూర్య కుమార్తె - పుత్రికోత్సాహంలో సూర్య, జ్యోతిక దంపతులు
స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక దంపతుల కుమార్తె దియా సూపర్ టాపర్ అని చెప్పాలి. ఆమె పదో తరగతి మార్కులు చూస్తే మీరు కూడా అదే మాట అంటారు.
సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి... పేరు దియా. ఒక అబ్బాయి... దేవ్. అమ్మాయి పదో తరగతి పూర్తి చేసింది. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఫలితాలు అనౌన్స్ చేసింది. అయితే, దియాకు ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలుసుకోవాలని తమిళ ప్రజలు ఆసక్తి చూపించారు. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు.
తమిళ సినిమా వర్గాలు, మీడియా ప్రకారం... పలు సబ్జెక్టుల్లో దియా టాప్ స్కోర్ చేసింది. తమిళంలో 95 మార్కులు, ఇంగ్లీష్‌లో 99, లెక్కల్లో వందకు 100 మార్కులు, సైన్స్‌లో 98 మార్కులు, సోషల్ సైన్స్‌లో 95 మార్కులు వచ్చాయట.
దియా మార్కులు చూసి సూర్య ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉందని చెన్నై టాక్.
Also Read : గోవాలో యాక్సిడెంట్ - తీవ్ర గాయాలైన నటుడిని హెలికాప్టర్‌లో బెంగళూరుకు తరలించిన కుటుంబ సభ్యులు
సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్ల పిల్లలు అప్పుడప్పుడూ సినిమాల్లో అతిథి పాత్రల్లో తళుక్కున మెరవడం సహజమే. అయితే... సూర్య, జ్యోతిక పిల్లలు మాత్రం ఇంకా సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతానికి చదువుల మీద దృష్టి పెట్టారు. ఇటు సూర్య గానీ, అటు జ్యోతిక గానీ ఎప్పుడూ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, కొన్ని పెళ్లిళ్లకు మాత్రం పిల్లలను తీసుకొచ్చారు.
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు
View this post on Instagram