అన్వేషించండి

Sundeep Kishan: ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌లో నాణ్యత లేని ఆహారం - క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్

Sundeep Kishan: యంగ్ హీరో సందీప్ కిషన్ చాలాకాలం క్రితమే ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. తాజాగా ఈ రెస్టారెంట్‌లో నాణ్యత లేదని వార్తలు రాగా దానిపై సందీప్ క్లారిటీ ఇచ్చాడు.

Sundeep Kishan: ఇటీవల హైదరాబాద్‌లోని చాలా రెస్టారెంట్స్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఎన్నో రెస్టారెంట్స్.. కల్తీ ఆహారాన్నీ విక్రయిస్తున్నారని బయటపడింది. తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రారంభించిన ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్‌లో కూడా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ తనిఖీలు చేపట్టిందని వార్తలు వచ్చాయి. ఆ తనిఖీలలో ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌లో సేఫ్టీ రూల్స్ పాటించకుండా ఆహారాన్ని సర్వ్ చేస్తున్నారని, పైగా 2022లో ఎక్స్‌పైర్ అయిపోయిన బియ్యాన్ని ఉపయోగిస్తున్నారని బయటికొచ్చింది. దీనిపై తాజాగా నటుడు సందీప్ కిషన్ స్పందించాడు.

నిజం తెలుసుకోండి..

‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ ముఖ్యమైన 6 రూల్స్‌నె పాటించడం లేదని కంప్లైంట్ ఫైల్ అయ్యింది. దాంతో పాటు తక్కువ క్వాలిటీ ఆహారం అందిస్తున్నారని కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ కంప్లైంట్ ఫైల్ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ కమీషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ.. స్వయంగా తమ సోషల్ మీడియాలో ప్రకటించింది. సికింద్రాబాద్‌లో ఉన్న ‘వివాహ భోజనంబు’లో తనిఖీలు నిర్వహించిన తర్వాత బయటపడిన తప్పులను ఈ సోషల్ మీడియా పోస్ట్‌లో వివరించింది. దీనిపై సందీప్ కిషన్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. వచ్చిన ప్రతీ హెడ్‌లైన్స్‌ను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోమని అన్నాడు.

శుభ్రంగా ఉంచుతాం..

8 ఏళ్లుగా వివాహ భోజనంబు అనేది మంచి, నాణ్యమైన ఆహారంతో కస్టమర్లను ఆకట్టుకుందని చెప్తూ వివరణ ఇచ్చాడు. ‘‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలావరకు ఫోటోలు తన కిచెన్ నుండి తీసినవి కాదు. ఎక్స్‌పైర్ అయిపోయిన రైస్ బ్యాగ్‌ను కుకింగ్‌కు ఉపయోగించరు. ఆ బ్యాగ్‌కు ఇంకా సీల్ వేసి ఉందని అధికారులు సైతం తెలిపారు. ఫోటోల్లో చూపించిన మురుగునీరు లంచ్ హవర్ తర్వాత గిన్నెలను తోమినప్పుడు బయటకు వెళ్లిపోయిన నీరు. ఇంట్లో కిచెన్స్‌ను ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో.. అలాగే మా కిచెన్స్ కూడా గంటకు ఒకసారి శుభ్రం చేస్తాం’’ అని తెలిపాడు సందీప్ కిషన్.

చర్యలు తీసుకుంటాం..

‘‘మేము ఫుడ్ కలర్స్, డాల్డా లాంటివి ఉపయోగించం. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కానీ అవి మా కిచెన్‌లో తీసినవి కాదు. దీనిని మేము ఖండిస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వచ్చి మా రెస్టారెంట్‌లో కొన్ని సమస్యలను గుర్తించింది. కానీ అవి నాణ్యమైన ఆహారానికి సంబంధించినవి కాదు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిపై మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. మేము ఆహార నాణ్యత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వము’’ అంటూ కస్టమర్లకు మాటిచ్చాడు సందీప్ కిషన్.

Also Read: అత్యంత విలువైన ప్రాజెక్ట్‌లో కృతి సనన్ పెట్టుబడి - స్వయంగా ప్రకటించిన యంగ్ బ్యూటీ

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget