Suman In Ananya: హారర్ సినిమా 'అనన్య'లో సుమన్ - ఈ నెలలోనే రిలీజ్!
'అనన్య' సినిమాలో సుమన్ కీలక పాత్ర చేశారు. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
![Suman In Ananya: హారర్ సినిమా 'అనన్య'లో సుమన్ - ఈ నెలలోనే రిలీజ్! Suman Plays Key Role In Horror Movie Ananya Know Release Date Suman In Ananya: హారర్ సినిమా 'అనన్య'లో సుమన్ - ఈ నెలలోనే రిలీజ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/14/a3493a0ef82beecbddc048fbe5c7af8d1710409833022313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Suman In Horror Movie Ananya: సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుమన్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. హీరోగా ఎన్నో విజయాలు సాధించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేశారు. రజనీకాంత్ 'శివాజీ'లో విలన్ రోల్ చేశారు. ఇప్పుడు ఆయన ఓ హారర్ సినిమా చేశారు.
జయరామన్, చందన, తోషి అలహరి హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ సినిమా 'అనన్య'. ప్రముఖ నటుడు సుమన్ కీలక పాత్ర చేశారు. ఇంకా ఇందులో ప్రజ్ఞ గౌతమ్, అరవింద్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వం వహించారు. శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు.
మార్చి 22న థియేటర్లలో 'అనన్య' విడుదల
Ananya Telugu Movie Releasing On March 22nd: హారర్ జానర్ నేపథ్యంలో 'అనన్య సినిమా తెరకెక్కించారు. అయితే... కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని దర్శక నిర్మాతలు చెప్పారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని తెలిపారు.
ఏపీ, తెలంగాణలో మార్చి 22న సినిమా విడుదలవుతున్న తరుణంలో బుధవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రీ రిలీజ్ నిర్వహించారు. ఇందులో నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శక నిర్మాత సాయి వెంకట్, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, శ్రీనివాస్ బోగిరెడ్డి, యంగ్ హీరో సందీప్ మాధవ్, యువ దర్శకుడు అఫ్జల్ సహా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Also Read: 'ఇన్‌స్పెక్టర్ రిషి' స్ట్రీమింగ్ డేట్ - హారర్ క్రైమ్ డ్రామాతో ఓటీటీలో నవీన్ చంద్ర వచ్చేది ఎప్పుడంటే?
విజయం మీద దర్శక నిర్మాతల ధీమా!
'అనన్య' సినిమాను ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశామని దర్శక నిర్మాతలు చెప్పారు. ఇంకా నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ మాట్లాడుతూ ''మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది. మా శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ సంస్థకు మంచి ఆరంభం ఇస్తుందని నమ్మకం ఉంది'' అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''సెన్సార్ సభ్యులు సినిమా చూశాక చాలా సేపు మా టీమ్ అందరితో మాట్లాడారు. వాళ్లు ఇచ్చిన ప్రశంసలు మర్చిపోలేం. ఈ నెల 22న థియేటర్లలో ప్రేక్షకుల ప్రశంసలు సైతం అందుకుంటుందని నమ్మకం ఉంది'' అని చెప్పారు. ప్రీ రిలీజ్ వేడుకలో తమ సినిమా ట్రైలర్ విడుదల చేసిన హీరో శ్రీకాంత్ మేకకు మరోసారి థాంక్స్ చెప్పారు.
Also Read: అరెరే విశ్వక్ సేన్... అప్పుడు అలా అంటివి - ఇప్పుడు సపోర్ట్ కావాలా? గట్టిగా ట్రోలింగ్ చేస్తున్నారే!
'అనన్య' సినిమాలో సీతా శ్రీనివాస్, శివాని శర్మ, చక్రవర్తి, 'జబర్దస్త్' అప్పారావు, పొట్టి చిట్టి బాబు, సుజాత, 'క్రాక్' శ్రీమణి కీలక క్యారెక్టర్లు చేశారు. ఈ చిత్రానికి నృత్యాలు: బ్రదర్ ఆనంద్ - బాలు, పోరాటాలు: దేవరాజ్, సంగీతం: త్రినాథ్ మంతెన, ఛాయాగ్రహణం: ఎ.ఎస్ రత్నం, కూర్పు: నందమూరి హరి, సహ నిర్మాత: బుద్ధాల సత్యనారాయణ, సమర్పణ: శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి, నిర్మాత: జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రసాద్ రాజు బొమ్మిడి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)