Inspector Rishi Web Series: 'ఇన్‌స్పెక్టర్ రిషి' స్ట్రీమింగ్ డేట్ - హారర్ క్రైమ్ డ్రామాతో ఓటీటీలో నవీన్ చంద్ర వచ్చేది ఎప్పుడంటే?
Naveen Chandra New Web Series: నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్ రిషి'. ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ ఎప్పుడు చూడొచ్చంటే?
హీరోగా, క్యారెక్టర్ ఆరిస్టుగా డిఫరెంట్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర (Naveen Chandra). ఆయన కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. 'పరంపర' అని ఒక వెబ్ సిరీస్ చేశారు. మార్చి నెలాఖరున మరో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ 'ఇన్‌స్పెక్టర్ రిషి' వెబ్ సిరీస్ తెరకెక్కించింది. ఈ రోజు సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
మార్చి 29 నుంచి 'ఇన్‌స్పెక్టర్ రిషి' స్ట్రీమింగ్
Streaming date of Inspector Rishi Web Series: మార్చి 29 నుంచి 'ఇన్‌స్పెక్టర్ రిషి' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో గురువారం వెల్లడించింది. ఈ సిరీస్ తమిళంలో తెరకెక్కించారు. అయితే... తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.
Small town secrets buried into a different realm! #InspectorRishiOnPrime, Mar 29 only on @primevideo @MBP_ProdCo @TheSunainaa @shukdev_lahiri @nandhini_js @jithinthorai #SrikrishnaDayal #Kumaravel @iamkannaravi @MalniJevaratnam #BargavSridhar @editorsuriya @MusicAshwath pic.twitter.com/twBkpQ3c9s
— Actor Naveen Chandra (@Naveenc212) March 14, 2024
'ఇన్‌స్పెక్టర్ రిషి' కథ ఏమిటి? ఎపిసోడ్స్ ఎన్ని?
'ఇన్‌స్పెక్టర్ రిషి' వెబ్ సిరీస్ (How Many Episides In Inspector Rishi)లో మొత్తం పది ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. మర్డర్ మిస్టరీ కథతో హారర్ జానర్ నేపథ్యంలో సిరీస్ తీశారట. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు 'చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు' అని పేర్కొన్నారు. సో... సూపర్ న్యాచురల్ కథతో సిరీస్ తెరకెక్కించి ఉంటారు. వరుస హత్యలు జరుగుతున్న ప్రాంతంలో ఇన్‌స్పెక్టర్ రిషి కేసును ఎలా సాల్వ్ చేశారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
Also Read: అరెరే విశ్వక్ సేన్... అప్పుడు అలా అంటివి - ఇప్పుడు సపోర్ట్ కావాలా? గట్టిగా ట్రోలింగ్ చేస్తున్నారే!
the laws of state don’t bind the supernatural!#InspectorRishiOnPrime, Mar 29@MBP_ProdCo @Naveenc212 @TheSunainaa @shukdev_lahiri @nandhini_js @jithinthorai #SrikrishnaDayal #Kumaravel @iamkannaravi @MalniJevaratnam #BargavSridhar @editorsuriya @MusicAshwath @MishMash2611… pic.twitter.com/2M3oPzZFyB
— prime video IN (@PrimeVideoIN) March 14, 2024
నందిని జెఎస్ 'ఇన్‌స్పెక్టర్ రిషి' వెబ్ సిరీస్ క్రియేటర్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పతాకంపై శుకదేవ్ లాహిరి అమెజాన్ ఓటీటీ కోసం ప్రొడ్యూస్ చేశారు. వీక్షకుల వెన్నులో వణుకు పుట్టించేలా, ప్రతి ఎపిసోడ్ హారర్ / థ్రిల్లర్ మూమెంట్స్ ఇచ్చేలా ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఇందులో సునైనా, కన్నా రవి, మాలినీ జీవరత్నం, శ్రీకృష్ణ దయాల్, కుమారవేల్, ఏజెంట్ టీనా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 'జిగర్తాండ డబుల్ ఎక్స్', 'పటాస్', 'శివప్పు', 'శరభం' వంటి సినిమాల ద్వారా తమిళ ప్రేక్షకులకు నవీన్ చంద్ర తెలుసు. ఇప్పుడు ఓటీటీలో ఆయనకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Also Read: జపాన్‌లో 'ఆర్ఆర్ఆర్'కి ఆ క్రేజ్ ఏంటి సామి - రాజమౌళి వస్తున్నాడని తెలిసి ఒక్క నిమిషంలో హౌస్ ఫుల్