Varanasi Event Bob Entry: బాబోయ్... 'బాబ్' మహేష్ ఎంట్రీ కోసం అంత ప్లానింగా - రాజమౌళితో మామూలుగా ఉండదు!
Varanasi Movie Making Video: వారణాసి ఈవెంట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. చూడటానికి మామూలుగా కనిపించవచ్చు. అందుకు చేసిన ప్రిపరేషన్ వర్క్ వీడియో రిలీజ్ చేశారు రాజమౌళి.

టైటిల్ రివీల్ చేయడం కోసం ఈ రేంజ్‌లో ఈవెంట్ చేస్తారా? అని యావత్ భారతీయ చిత్రసీమ అంతా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహిస్తున్న 'వారణాసి' (Varanasi Movie Event 2025) టైటిల్ రివీల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ భారీ ఎత్తున జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఆ ఈవెంట్‌లో నంది మీద మహేష్ ఎంట్రీ చూసి ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోయారు. కొంత మందికి చూడటానికి ఆ ఎంట్రీ సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ, అందుకు చేసిన ప్రిపరేషన్ వర్క్ మాత్రం చాలా ఉంది. ఆ వీడియో రిలీజ్ చేశారు రాజమౌళి.
రాజమౌళితో మామూలుగా ఉండదు!
'వారణాసి' టైటిల్ రివీల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ గుర్తుందా? అందులో మహేష్ బాబు మాటలు గుర్తు ఉన్నాయా? సాధారణంగా తనకు అలవాటైన పద్ధతిలో ఒక బ్లూ షర్ట్ వేసుకుని వస్తానంటే వద్దన్నారని చెప్పారు. ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో చూశారుగా అని మాట్లాడారు. ఆ ఎంట్రీ వెనుక ఆయన పడిన కష్టం చాలా ఉంది. ఏదో ఫంక్షన్‌కు వచ్చినట్టు రాలేదు. నంది మీద ఆ ఎంట్రీ వెనుక రిహార్సిల్స్ జరిగాయి.
రాజమౌళితో మామూలుగా ఉండదు కదా! కేవలం ఒక ఫంక్షన్ ఎంట్రీ కోసం ఇలా ప్లాన్ చేస్తే... ఇక సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ సీన్లు ఉన్నాయో? మహేష్ బాబుకు ఎటువంటి ఎలివేషన్స్ ఇచ్చారో అభిమానులతో పాటు ప్రేక్షకుల ఊహకు వదిలేయవచ్చు. ఆ ప్రిపరేషన్, మేకింగ్ వీడియో చూడండి.
Also Read: ప్రభాస్‌తో ఐదారు సీన్లు ఇస్తారనుకున్నా, కానీ... 'ది రాజా సాబ్'లో రోల్‌పై మాళవిక ఏమన్నారంటే?
View this post on Instagram
రాముడిగా మహేష్... 2027 వేసవిలో రిలీజ్!
'రామాయణం'లో ఒక కీలకమైన ఘటాన్ని తన సినిమాలో చూపించబోతున్నానని 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి వెల్లడించారు. అంతే కాదు... శ్రీరాముడిగా మహేష్ నటిస్తున్నారని తెలిపారు. సినిమాలో ఆయన పేరు రుద్ర. అంటే శివుడు. వారణాసి నగరంలోనూ శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మరి రాముడికి, శివునికి మధ్య ఏ తరహా కథతో రాజమౌళి సినిమా తీస్తున్నారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అలాగే, టైటిల్ గ్లింప్స్‌లో హనుమంతుడిని చూపించారు. ఆయన పాత్ర మీద కూడా ఆసక్తి నెలకొంది.
ప్రియాంకా చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా, ఇంకా పలువురు పాన్ ఇండియా తారాగణం నటిస్తున్న 'వారణాసి'ని దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయకు చెందిన షోయింగ్ బిజినెస్ సంస్థ నిర్మాణ భాగస్వామి. ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమానుంచి విడుదలైన రెండు పాటలను చైతన్య ప్రసాద్ రాశారు.





















