Malavika Mohanan: ప్రభాస్‌తో ఐదారు సీన్లు ఇస్తారనుకున్నా, కానీ... 'ది రాజా సాబ్'లో రోల్‌పై మాళవిక ఏమన్నారంటే?
ABP Southern Rising Summit 2025: ప్రభాస్ 'ది రాజా సాబ్'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతున్నారు మాళవికా మోహనన్. 'ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్'లో తన రోల్ గురించి మాట్లాడారు.

తెలుగు ప్రేక్షకులకూ మలయాళీ భామ మాళవికా మోహనన్ తెలుసు. ఇప్పటి వరకు ఆమె కథానాయికగా నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ఏదీ విడుదల కాలేదు. కానీ తమిళంలో నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట', దళపతి విజయ్ 'మాస్టర్', చియాన్ విక్రమ్ 'తంగలాన్' తెలుగులోనూ విడుదల అయ్యాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్'తో మాళవికా మోహనన్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అందులో తన రోల్ గురించి చెన్నై వేదికగా జరుగుతున్న 'ABP Southern Rising Summit 2025'లో మాళవికా మోహనన్ మాట్లాడారు.
సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ తక్కువ!
Malavika Mohanan on her role in The Raja Saab: మాళవికా మోహనన్ మలయాళీ. అయితే తండ్రి కెయు మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కావడం వల్ల ముంబైలో పెరిగారు. మలయాళ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి... తమిళ్, హిందీ, తెలుగు సినిమాలు చేశారు. చెన్నైలో జరిగిన 'ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025'లో 'Working Across Languages: Staying Close to the Roots' సెషన్‌లో మాళవికా మోహనన్ మాట్లాడారు. అందులో 'ది రాజా సాబ్' సినిమా గురించి మాట్లాడారు.
''ప్రభాస్ సినిమా అంటే రెండు మూడు సీన్లు ఇస్తారని అనుకున్నాను. ఎందుకంటే సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ తక్కువ. కథానాయికకు ఒక్క పాట వస్తుంది. రెండు పాటల్లో కనిపించే అవకాశం వస్తే లక్కీ. కానీ, 'ది రాజా సాబ్'లో నాది మంచి రోల్. అమ్మాయి (కథానాయిక)కు అటువంటి పాత్ర చాలా గొప్ప. అది నా తెలుగు డెబ్యూ. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల అవుతోంది. ఆ సినిమా కోసం ఎగ్జైటెడ్‌గా ఉన్నాను'' అని మాళవికా మోహనన్ తెలిపారు.
'ది రాజా సాబ్'లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. మాళవికా మోహనన్ కాకుండా ఒకరు నిధి అగర్వాల్ కాగా... మరో హీరోయిన్ రిద్ధి కుమార్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లలో మాళవికాకు మంచి రోల్ దక్కినట్లు అర్థం అవుతోంది. ప్రభాస్, మాళవిక కాంబినేషన్‌లో రొమాంటిక్ సీన్లు మాత్రమే కాదు... హారర్ నేపథ్యంలోనూ మాళవిక కొన్ని సన్నివేశాలు చేసినట్లు తెలుస్తోంది. మరి సినిమా విడుదల అయితే గానీ ఆవిడ క్యారెక్టర్‌లో ఎన్ని షేడ్స్ ఉన్నాయనేది అర్థం కాదు.
తండ్రి సినిమాటోగ్రాఫర్ కావడం వల్ల చిన్నతనంలో తాను షారుఖ్ ఖాన్‌ను కలిసినట్టు మాళవికా మోహనన్ తెలిపారు. బాలీవుడ్ బాద్షాను చూసినప్పుడు తనకు మాటలు రాలేదన్నారు. షారుఖ్ వెళ్ళాక తల్లిదండ్రులు తనను కాస్త మందలించినట్టు తెలిపారు. మలయాళంలో మోహన్ లాల్ 'హృదయపూర్వం'లోనూ మాళవికా మోహనన్ నటించారు. మోహన్ లాల్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని, ఆయనతో నటించడానికి తాను రిహార్సిల్స్ చేయాల్సి వచ్చిందని మాళవికా మోహనన్ తెలిపారు.





















