Upcoming Telugu Movies : లాస్ట్ మంత్... ఫస్ట్ వీక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో 'అఖండ' తాండవం... ఓటీటీల్లో మూవీస్/వెబ్ సిరీస్‌ల లిస్ట్
This Week Telugu Movies : మూవీ లవర్స్‌కు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా ఈ వారం సినిమాలు థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఓటీటీల్లో 25కు పైగా చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

Upcoming Telugu Movies In Theaters OTT Releases In December 1st Week : ఈ వారం థియేటర్లలో కొత్త మూవీస్‌తో పాటు ఓటీటీల్లో 25 పైగా చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య మూవీతో పాటు బాలీవుడ్ మూవీ కూడా థియేటర్లలో సందడి చేయనుంది. ఓటీటీల్లో రీసెంట్ బ్లాక్ బస్టర్స్‌తో పాటు హిట్ వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ ఫుల్ లిస్ట్ ఓసారి చూస్తే...
బాలయ్య అఖండ 2 తాండవం
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతోన్న డివోషనల్ హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2 తాండవం.' ఈ మూవీ ఈ నెల 5న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అఖండ' సీక్వెల్‌గా మూవీ తెరకెక్కగా... బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంయుక్త హీరోయిన్ కాగా... ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. పూర్ణ, హర్షాలి కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట మూవీని నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించారు.
రణవీర్ 'ధురంధర్'
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' కూడా ఈ నెల 5నే ప్రేక్షకుల ముందుకు రానుంది. రియల్ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read : వెంకీ త్రివిక్రమ్ మూవీకి క్రేజీ టైటిల్! - ఫ్యామిలీ ఆడియన్స్‌కు మళ్లీ ఫుల్ ట్రీట్ కన్ఫర్మేనా!
ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌లు
- అమెజాన్ ప్రైమ్ వీడియో - పాంచ్ మినార్ (తెలుగు మూవీ), శశివదనే (తెలుగు మూవీ), బ్రాట్ (కన్నడ మూవీ), కాంతార (హిందీ వెర్షన్), లాస్ట్ డేస్ (ఇంగ్లీష్ మూవీ రెంటెడ్), బుల్గానియా (ఇంగ్లీష్ మూవీ - రెంటెడ్), రిగ్రెట్టింగ్ యు (ఇంగ్లీష్ మూవీ - రెంటెడ్), ఆర్చిన్ (ఇంగ్లీష్ మూవీ), థామా, అవాకాత్ కా బాహర్
- నెట్ ఫ్లిక్స్ - సన్నీ సంస్కారీకి తులసీ కుమారీ (హిందీ మూవీ), ఆర్యన్ (తెలుగు మూవీ), లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్, స్ట్రేంజర్ థింగ్స్ (వెబ్ సిరీస్ సీజన్ 5 - ఇంగ్లీష్ / తెలుగు), జింగిల్ బెల్ హెయిస్ట్ (ఇంగ్లీష్/తెలుగు మూవీ), క్యాచ్ స్టీలింగ్ (ఇంగ్లీష్ మూవీ), స్టీఫెన్ (డిసెంబర్ 5), ది గర్ల్ ఫ్రెండ్ (డిసెంబర్ 5)
- జియో హాట్ స్టార్ - ఆన్ పావమ్ పొల్లతాతు (మలయాళం/తెలుగు మూవీ), బెల్ హెయిర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 4), డీయస్ ఈరే, ది బ్యాడ్ గాయ్స్ (యానిమేటెడ్ సిరీస్ సీజన్ 2)
- సోనీ లివ్ - కుట్రమ్ పురింధవన్ (వెబ్ సిరీస్ - డిసెంబర్ 5)
- జీ5 - రేగాయ్ (తమిళ్ వెబ్ సిరీస్), ది పెట్ డిటెక్టివ్ (తమిళ్/తెలుగు)
- లయన్స్ గేట్ ప్లే - రష్ (ఇంగ్లీష్ మూవీ), ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ (ఇంగ్లీష్ మూవీ)
- ఈటీవీ విన్ - కరీముల్లా బిర్యానీ పాయింట్, అర్జున్ చక్రవర్తి




















