యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న చిన్న సినిమా టీజర్ - అందులో ఏముందంటే?
యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న వీడియోలు చూస్తే... అందులో ఒక చిన్న సినిమా టీజర్ ఉంది. ఆ సినిమా పేరు 'మసూద'. ఇంతకీ, ఆ టీజర్‌లో ఏముంది? అనేది ఒక్కసారి చూస్తే...
Masooda Movie Teaser Trending On YouTube: యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న వీడియోలు చూస్తే... అందులో ఒక చిన్న సినిమా టీజర్ ఉంది. ఆ సినిమా పేరు 'మసూద'. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కూడా టీజర్ బావుందని ప్రశంసలు కురిపించారు. ఈ టీజర్‌లో ఏముంది? అనేది ఒక్కసారి చూస్తే...
'మసూద'లో తిరువీర్ (Thiruveer) హీరో. ఆయన 'జార్జ్ రెడ్డి'లో లలన్ సింగ్ పాత్రలో నటించడంతో పాటు 'ఆహా' వెబ్ సిరీస్ 'సిన్'లో హీరోగా నటించారు. పోనీ, ఆయన జోడీగా నటించిన అమ్మాయి పేరున్న కథానాయికా? అంటే... కాదు. 'గంగోత్రి'లో బాల నటిగా కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram)కు కథానాయికగా తొలి చిత్రమిది. సీనియర్ హీరోయిన్ సంగీత (Sangeetha) కీలక పాత్ర చేశారు.
Masooda Teaser Review : 'మసూద' టీజర్ చూస్తే... ఇదొక హారర్ డ్రామా సినిమా అనే విషయం అర్థం అవుతోంది. 'టాబ్లెట్స్‌తో తనకు నయం అవుతుందని నాకు అనిపించడం లేదు గోపీ! అప్పుడప్పుడూ తాను చేసేది చూస్తే ఎవరైనా పీర్ బాబాకు చూపిస్తే మంచిదేమో! ఏమంటావ్' అని సంగీత చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. 'ఏమో అండీ. నాకు అస్సలు ఐడియా లేదు' అని తిరువీర్ చెబుతారు. ఆ తర్వాత స్క్రీన్ మీద చాలా విజువల్స్ కనిపిస్తాయి. కథేంటి? అనేది క్లారిటీగా చెప్పలేదు. కానీ, ముస్లిం ఫ్యామిలీ నేపథ్యంలో సినిమా తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది.
మతం, మూఢ నమ్మకాలు, సైన్స్ నేపథ్యంలో సినిమా రూపొందించారు. ఇందులో గోపిగా తిరువీర్ నటించారు. సైన్స్ టీచర్ పాత్రలో సంగీత నటించారు. శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్ తదితరులనూ చూపించారు. తిరువీర్ దేని కోసమో వెతకడం, ఆయన్ను ఎవరో కత్తితో పొడిచినట్టు చూపించడం... మొత్తం మీద సినిమాపై ఈ టీజర్ ఆసక్తి కలిగించింది.
'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. 'మళ్ళీ రావా'తో గౌతమ్ తిన్ననూరిని, 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో స్వరూప్‌ను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకులుగా పరిచయం చేసిన రాహుల్ యాదవ్ నక్కా.. . ఈ సినిమాతో సాయికిరణ్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
Also Read : ఆమిర్ ఖాన్‌పై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు - యాంటీ హిందూ పీకే అంటూ విమర్శలు
అఖిల రామ్, బాంధవి శ్రీధర్, 'సత్యం' రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో ఆయన నేపథ్య సంగీతం బావుంది.
Also Read : ప్రశాంతంగా సాగిపోవాలంటే కెలక్కూడదు! కెలికారో? - సత్యదేవ్ ఫుల్ యాక్షన్ మోడ్
Been a while since I have seen a true blue horror film . This looks very interesting. As always @RahulYadavNakka finding new and different films . All the best to the whole team of #Masooda. May you score a big hit at the box office. https://t.co/1Rk7CNDZ44
— Naveen Polishetty (@NaveenPolishety) August 2, 2022