News
News
X

Krishnamma Teaser : ప్రశాంతంగా సాగిపోవాలంటే కెలక్కూడదు! కెలికారో? - సత్యదేవ్ ఫుల్ యాక్షన్ మోడ్ 

సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'కృష్ణమ్మ'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.

FOLLOW US: 

''ఈ కృష్ణమ్మలాగే మేమూ ఎప్పుడు పుట్టామో? ఎలా పుట్టామో? ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు పుట్టినా... ఎలా పుట్టినా... పుట్టిన ప్రతి వాడికీ ఏదో ఒక కథ ఉండే ఉంటుంది'' అని సత్యదేవ్ (Satyadev) అంటున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'కృష్ణమ్మ' (Krishnamma Movie). ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ (Koratala Siva) స‌మ‌ర్ప‌ణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ పతాకంపై  వి.వి. గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మ‌ల‌పాటి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా టీజర్ నేడు విడుదల చేశారు. అందులో డైలాగ్ ఇది.

సాయి తేజ్ చేతుల మీదుగా... 
'కృష్ణమ్మ' టీజర్‌ను సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) విడుదల చేశారు. టీజర్ బావుందని, సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
 
కృష్ణమ్మ కథేంటి (Krishnamma Movie Story)?
ముగ్గురు స్నేహితులు, ఓ ప్రతినాయకుడి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే 'కృష్ణ‌మ్మ' చిత్ర కథ అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఒక చిన్న ఘ‌ట‌న ముగ్గురి స్నేహితుల జీవితాలను ఎటువంటి మలుపు తిప్పింది? వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలని చిత్ర బృందం చెబుతోంది. ''కథ నడక, నది నడత ప్రశాంతముగా సాగిపోవాలంటే ఎవ్వడూ కెలక్కూడదు. కానీ, కెలికారో?'' అని సత్యదేవ్ డైలాగ్ చెప్పిన తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఆయనను చూపించారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన ఇటువంటి సినిమా చేయలేదు. ఆయనకు ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఫిల్మ్ ఇది. 

View this post on Instagram
 
A post shared by Archana (@archanaa_official)

'కృష్ణమ్మ' టీజర్‌లో సత్యదేవ్ నటన, యాక్షన్ సీన్స్, కాల భైర‌వ నేపథ్య సంగీతం సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ సినిమాలో త‌మ అభిమాన హీరో (Satyadev Kancharana) ను చూడాల‌నే ప్రేక్షకుల కోరిక 'కృష్ణ‌మ్మ'తో తీర‌నుంది.

Also Read : విదేశాల నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్ - మేనత్త ఉమా మహేశ్వరి మరణంతో

త్వ‌ర‌లోనే 'కృష్ణమ్మ' సినిమాను థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని నిర్మాత తెలిపారు.

Also Read : 'మా'లో సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి - నిర్మాతలకు విష్ణు మంచు రిక్వెస్ట్

Published at : 04 Aug 2022 01:50 PM (IST) Tags: Satyadev Sai Dharam Tej Krishnamma Movie Krishnamma Teaser Review

సంబంధిత కథనాలు

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాటు వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాటు వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ 

Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ 

Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

టాప్ స్టోరీస్

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ