Kangana Ranaut Vs Aamir Khan: ఆమిర్ ఖాన్‌పై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు - యాంటీ హిందూ పీకే అంటూ విమర్శలు
'లాల్ సింగ్ చడ్డా' విడుదలకు ముందు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మీద కంగనా రనౌత్ నిప్పులు చెరిగారు. యాంటీ హిందూ పీకే అంటూ విరుచుకుపడ్డారు.
'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) సినిమా విడుదలకు ముందు ఆమిర్ ఖాన్ (Aamir Khan) ను కంగనా రనౌత్ (Kangana Ranaut) టార్గెట్ చేశారు. కొన్ని రోజుల నుంచి 'లాల్ సింగ్ చడ్డా'ను బాయ్ కాట్ చేయాలని కొంత మంది ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. దీని వెనుక ఆమిర్ మాస్టర్ మైండ్ ఉందనేది కంగనా ఆరోపణ.
''త్వరలో విడుదల కానున్న 'లాల్ సింగ్ చడ్డా' సినిమా చుట్టూ నెగెటివిటీ క్రియేట్ కావడం వెనుక ఆమిర్ ఖాన్ గారి మాస్టర్ మైండ్ ఉందని నేను భావిస్తున్నాను. ఈ ఏడాది హిందీ సినిమాలు ఏవీ విజయాలు సాధించలేదు... ఒక్క కామెడీ సినిమా సీక్వెల్ మినహా! భారతీయ సంస్కృతిని లేదంటే స్థానికతను ప్రతిబింబించే సౌత్ ఇండియా సినిమాలు (South India Films) మాత్రమే విజయాలు సాధించాయి. ఒక హాలీవుడ్ సినిమా ఎలాగో విజయం సాధించదు'' అని కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.
'లాల్ సింగ్ చడ్డా' ఫ్లాప్ అవుతుందని చెప్పడంతో కంగనా రనౌత్ ఆగలేదు. దేశంలో అసహనం పెరుగుతోందంటూ గతంలో ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను మరోసారి ఆమె గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత, యాంటీ హిందూ పీకే తీసిన ఆమిర్... ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ తీశారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. హిందూ లేదంటే ముస్లిం అనేది అసలు విషయం కాదని, హిందీ సినిమాలు ప్రేక్షకుల పల్స్ అర్థం చేసుకోవాలని ఆమె సలహా ఇచ్చారు. మతానికి, ఐడియాలజీతో ముడి పెట్టవద్దని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.
Also Read : ప్రశాంతంగా సాగిపోవాలంటే కెలక్కూడదు! కెలికారో? - సత్యదేవ్ ఫుల్ యాక్షన్ మోడ్
ఆగస్టు 11న ఈ 'లాల్ సింగ్ చడ్డా' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో కరీనా కపూర్ ఖాన్ కథానాయిక. బాలరాజు పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. హాలీవుడ్ హిట్ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్ ఇది. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. వయాకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తోంది.
Also Read : 'మా'లో సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి - నిర్మాతలకు విష్ణు మంచు రిక్వెస్ట్, 'దిల్' రాజుతో డిస్కషన్