అన్వేషించండి

దుబాయ్ లో గ్రాండ్ గా సైమా 2023 వేడుకలు - ఎప్పుడంటే!

సైమా 2023 వేడుకలు దుబాయ్ లో నిర్వహించబోతున్నట్లు తాజాగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి హీరో రానా , మృణాల్ ఠాకూర్ సైమాలో భాగం అవడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు.

దక్షిణాది సినీ పరిశ్రమకి సంబంధించి 'సైమా' అవార్డ్స్(SIIMA) ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా(SIIMA) 2023 ఉత్సవాలకి ముహూర్తం ఖరారు అయింది. సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించబోతున్నట్టు సైమా చైర్ పర్సన్ బృందాప్రసాద్ వెల్లడించారు. సుమారు 11 ఏళ్లుగా ఎంతో విజయవంతంగా సైమా వేడుకలు జరుగుతున్నాయని, ఈ ఏడాది జరిగే సైమా ఉత్సవాలకు దుబాయ్ నగరం వేదిక కానుందని ఈ సందర్భంగా బృందాప్రసాద్ తెలియజేశారు. అంతేకాదు ఈసారి జరిగే సైమా వేడుకలకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా(Nexa) స్పాన్సర్ గా వ్యవహరించందని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే సైమా వేడుకల గురించి అధికారిక సమాచారం ఇచ్చేందుకు తాజాగా ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైమా చైర్ పర్సన్ బృందాప్రసాద్ మాట్లాడుతూ.. "సౌత్ ఇండియాలో అనేక సినీ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలోని సృజనాత్మకతను గుర్తించేందుకు, ప్రతిభను ప్రోత్సహించేందుకు సైమా, నెక్సా కలిసాయి. ఇది చాలా ఆనందం కలిగించే విషయం. ఇకనుంచి ఈ బంధం ఎంతో బలంగా ప్రభావం చూపించాలని ఆశిస్తున్నా" అని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. "సైమా సంస్థ దక్షిణాది సినీ పరిశ్రమను ఓకే తాటిపైకి తెచ్చింది. ఈ వేడుకల్లో నేను భాగం అవడం ఎంతో ఆనందంగా ఉంది" అని అన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ "అభిమానుల ప్రేమను తను స్వీకరించానని చెబుతూ తన తొలిచిత్రమైన 'సీతారామం' గురించి ప్రస్తావించారు. ఈ సినిమా విడుదలైన వెంటనే తాను సైమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. దుబాయ్ లోని D. W.T. C జరిగే ఈ వేడుకలు పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు" చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్ లో సైమా మొదటి స్థానంలో ఉంది. అయితే సైమా వేడుకలు దుబాయ్ లో నిర్వహించడం ఇది మొదటిసారి కాదు.

గతంలో కూడా పలుసార్లు దుబాయ్ వేదికగా సైమా ఉత్సవాలు  జరిగాయి. గత ఏడాది సైమ ఉత్సవాలు అక్టోబర్ నెలలో ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. దక్షిణాదికి చెందిన పలువురు అగ్ర నటీనటులు ఈ వేడుకలు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ అవార్డుల ప్రధాన ఉత్సవంలో సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప : ది రైజ్' ఎక్కువ అవార్డులను కైవసం చేసుకుని జోరు చూపించింది. ఏకంగా ఆరు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు క్యాటగిరిలో 'పుష్ప' సినిమాకి సైమా అవార్డ్స్ దక్కడం విశేషం. మరి ఈసారి సైమా 2023 అవార్డ్స్ లో టాలీవుడ్ తరఫున ఏ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ దక్కుతాయో చూడాలి.

Also Read : విజయ్ 'లియో' లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ - అసలు నిజం ఇదే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Eshwar Sai Madhuri Rathod : అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
Alpha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆలియా భట్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆలియా భట్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
YS Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
Embed widget