Siddharth: ‘పుష్ప 2’ పాట్నా ఈవెంట్‌పై సిద్ధూ అక్కసు... మాములు డ్యామేజ్ కాదిది - పుసుక్కున అలా అనేశాడేంటి?
Siddharth Comments On Pushap 2: ‘పుష్ప 2’ సినిమాను టార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప 2 పాట్నా ఈవెంట్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీగా మారాయి.
‘పుష్ప 2’ సినిమాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో సిద్ధార్థ్. ప్రస్తుతం ఆయన నటించిన ‘మిస్ యూ’ సినిమా తమిళనాడులో తుఫాన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 29న విడుదల కావాల్సిన ఈ సినిమా... డిసెంబర్ 13న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే నవంబర్ 29న విడుదల అనుకున్నప్పుడు చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న సిద్ధార్థ్.. ‘పుష్ప’పై చేసిన కామెంట్స్ వైరల్ అవగా.. ఇప్పుడు మరోసారి ఆయన ‘పుష్ప 2’ ప్రమోషన్స్ నిమిత్తం పాట్నాలో జరిగిన వేడుకపై సంచలన కాదు కాదు.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. పుష్పరాజ్ ఫ్యాన్స్‌కి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అసలింతకీ సిద్ధార్థ్ ఏమన్నాడంటే..
‘పుష్ప2 ది రూల్’ ప్రమోషన్స్ నిమిత్తం పాట్నాలో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించగా.. ఒక పొలిటికల్ మీటింగ్‌కి, ఇంకా చెప్పాలంటే, అంతకంటే ఎక్కువగా జనం తండోపతండాలుగా వచ్చారు. నిజంగా ఆ జనాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు కూడా. ఆ వేడుకకు జనాలు ఎలా వచ్చారో చూశారా.. అనే ప్రశ్న తాజాగా ‘మిస్ యూ’ ప్రమోషన్స్‌లో సిద్ధార్థ్‌కు ఎదురైంది. ఈ ప్రశ్నకు సిద్ధార్థ్ సెటైరికల్‌గా జవాబిచ్చాడు. ‘‘అదసలు పెద్ద విషయమే కాదు. అది మార్కెటింగ్ జిమ్మిక్కు. ఇండియాలో జనాన్ని సమీకరించడం పెద్ద విషయమే కాదు. ఒక కన్‌స్ట్రక్షన్ దగ్గర జేసీబీ వర్క్ జరుగుతున్నా.. జనాలు గుమిగూడతారు. బిర్యానీ, క్వార్టర్ సీసా ఇస్తే చాలు పొలిటికల్ మీటింగ్స్‌కి జనాలు వస్తారని పొలిటికల్ మీటింగ్స్ టైమ్‌లో మాట్లాడుకుంటాం కదా. జనాలు వస్తేనే సక్సెస్ అనుకుంటే.. పొలిటికల్ మీటింగ్స్ పెట్టిన వారంతా గెలుస్తున్నారా? ఇండియాలో జనం గుమిగూడటం అనేది సహజం. అది చాలా చిన్న విషయం’’ అంటూ సిద్ధార్థ్ ఇచ్చిన ఆన్సర్‌తో అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Siddharth about #Pushpa2TheRule event:
— AmuthaBharathi (@CinemaWithAB) December 10, 2024
- It's not a big matter that crowd gathering in Bihar, it's marketing. In India Even for JCB crowd will gather
- For all political meetings the crowd is gathering. We call it as Biryani & quarter packet crowd pulling pic.twitter.com/hE1km7G8IJ
అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కూడా ‘పుష్ప’ ప్రస్తావన వచ్చినప్పుడు సిద్ధార్థ్ ఇలానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప 2’కు పోటీగా మీ సినిమాను విడుదల చేయడానికి కారణం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నేను పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కంట్రోల్‌లో లేని విషయాల గురించి నేను మాట్లాడను. రెండో వారంలో కూడా థియేటర్లలో నా సినిమా ఉండాలంటే ముందు ప్రేక్షకులకు నచ్చాలి. సినిమా బాగుండాలి. నా సినిమా బాగుంటే థియేటర్ల లోంచి ఎవరూ తీసేయరు. ప్రతి సినిమా పెద్ద సినిమానే. సినిమా బడ్జెట్‌ను బట్టి.. ఆ సినిమా పెద్దదా? చిన్నదా? అనే విషయాన్ని నిర్ణయించకూడదు’’ అని సమాధానమిచ్చాడు సిద్ధార్థ్. మొత్తంగా అయితే మరో రెండు రోజుల్లో తన సినిమా విడుదలను పెట్టుకుని సిద్ధార్థ్ ఇలా కాంట్రవర్సీ చేసుకోవడం ఏం బాలేదని ఆయన అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. పోనీలే ఇలాగైనా సిద్ధార్థ్ సినిమా ఒకటి వస్తుందని జనాలకు తెలుస్తుందని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
సిద్ధార్థ్ విషయానికి వస్తే... ఆ మధ్య ‘బొమ్మరిల్లు’తో పాటు మరికొన్ని మంచి సినిమాలలో నటించి, నటుడిగా దాదాపు స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సిద్ధార్థ్‌కు ఈ మధ్య మాత్రం సినిమాల పరంగా అస్సలు కలిసి రావడం లేదు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ, హిట్టు మాత్రం ఆయనని వదిలేసి చాలా కాలం అవుతుంది. రీసెంట్‌గా వచ్చిన ‘చిన్నా’ చిత్రం కాస్త పరవాలేదనే టాక్‌ని సొంతం చేసుకుంది తప్పిదే.. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు పోయాయో కూడా ఎవరికీ తెలియదు. అది, ప్రస్తుతం సిద్ధార్థ్ సినిమాల పరిస్థితి. మరోవైపు హీరోయిన్ అదితి రావు హైదరిని ప్రేమ వివాహం చేసుకున్న సిద్ధార్థ్.. ఆ పెళ్లితో వార్తలలో నిలుస్తూనే ఉన్నారు.
Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?