Shruti Haasan: కమల్ హాసన్ ఇంట న్యూ ఇయర్ వేడుకలు - బాయ్‌ఫ్రెండ్‌తో శృతి సందడి
Shruti Haasan: కమల్ హాసన్ ఇంట న్యూ ఇయర్ వేడుకలు చాలా సింపుల్‌గా జరిగిపోయాయి. దానికోసం చెన్నైకు ప్రయాణమయ్యింది శృతి. కానీ ఈ వేడుకలకు తనతో పాటు తన బాయ్‌ఫ్రెండ్ షాంతనును కూడా తీసుకెళ్లింది.
![Shruti Haasan: కమల్ హాసన్ ఇంట న్యూ ఇయర్ వేడుకలు - బాయ్‌ఫ్రెండ్‌తో శృతి సందడి Shruti Haasan arrives with boyfriend Santanu Hazarika for Kamal Haasan new year house party Shruti Haasan: కమల్ హాసన్ ఇంట న్యూ ఇయర్ వేడుకలు - బాయ్‌ఫ్రెండ్‌తో శృతి సందడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/6ff00d759dc43fc210a9ff02fded5d9a1704170677871802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kamal Haasan : సినీ సెలబ్రిటీల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ఫేవరెట్ నటీనటుల న్యూ ఇయర్ పోస్టులకు ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు. ఇక శృతి హాసన్ కూడా ఎప్పటిలాగానే తన స్టైల్‌లో వారి ఇంట్లో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో తన తండ్రి కమల్ హాసన్‌తో పాటు తన బాయ్‌ఫ్రెండ్ షాంతను హజారికా కూడా ఉన్నాడు. అంటే ఈ న్యూ ఇయర్‌ను తండ్రి, బాయ్‌ఫ్రెండ్ ఇద్దరితో కలిసి శృతి సెలబ్రేట్ చేసుకుందన్నమాట అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ఫోటోల్లో మరో స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారు.
తండ్రి, బాయ్‌ఫ్రెండ్‌తో న్యూ ఇయర్..
శృతి హాసన్.. గత కొంతకాలంగా ఆర్టిస్ట్ షాంతను హజారికాతో ప్రేమలో ఉందని తెలిసిన విషయమే. మామూలుగా తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా దాచిపెట్టని శృతి.. షాంతను విషయం కూడా తానే స్వయంగా బయటపెట్టింది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కూడా ఉంటుంది. ఇక తాజాగా తన తండ్రితో న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడం కోసం చెన్నై ప్రయాణమయ్యింది ఈ భామ. తనతో పాటు తన బాయ్‌ఫ్రెండ్ షాంతనును కూడా తీసుకెళ్లింది. న్యూ ఇయర్ వేడుకల్లో శృతి, కమల్ హాసన్, షాంతను కలిసి పోజులిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’..
ఇక కమల్ హాసన్ ఇంట జరిగిన ఈ పార్టీలో శృతి, షాంతనుతో పాటు మణిరత్నం, తన భార్య సుహాసిని కూడా పాల్గొన్నారు. ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినప్పటి నుండి మణిరత్నంకు, కమల్ హాసన్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అంతే కాకుండా వీరి కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు కూడా వచ్చాయి. కమల్ హాసన్, మణిరత్నం అనేది ఒక క్లాసిక్ కాంబినేషన్‌లాగా మిగిలిపోయింది. ఇక చాలాకాలం తర్వాత ‘థగ్ లైఫ్’ అనే సినిమా కోసం వీరిద్దరూ మళ్లీ చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే ‘థగ్ లైఫ్’ మూవీ నుండి ఒక గ్లింప్స్ విడుదల కాగా.. అందులో కమల్ చాలా డిఫరెంట్ లుక్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతే కాకుండా కమల్ చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.
A Powerhouse Gathering With #Ulaganayagan #KamalHaasan, #ManiRatnam, #Suhasini, And #ShrutiHaasan In The Latest Celebration Pic🌟🖤🔥 pic.twitter.com/c0OKmRq8dc
— Thriller Soundtrack Music (@sandeeprathi100) January 1, 2024
తండ్రి బాటలో కూతురు..
శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే ‘ఇండియన్ 2’ అనే మూవీని ప్రారంభించారు కమల్ హాసన్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. ఎలాగైనా దీనిని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కమల్ పట్టుదలతో ఉన్నారు. ఈ ఏడాదిలో ‘ఇండియన్ 2’ను ఎలాగైనా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు హెచ్ వినోథ్ దర్శకత్వంలో కూడా తాను ఒక సినిమా చేయనున్నట్టు కమల్ ఇప్పటికే ప్రకటించారు. ఓవైపు కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంటే.. తన వారసురాలు శృతి హాసన్ సైతం టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా ట్యాగ్‌ను సంపాదించుకుంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’లో శృతి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)