Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Sankranthiki Vasthunam : 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ మీట్ సందర్భంగా వెంకటేష్ ఈ మూవీ సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. అలాగే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

వెంకటేష్ దగ్గుబాటి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ హడావిడి ఇంకా తగ్గలేదు. పొంగల్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ గురించి తాజాగా వెంకటేష్ ఒక క్రేజీ అప్డేట్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీ సీక్వెల్ గురించి తాజాగా ఆయన హింట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ రిలీజ్ డేట్ ను కూడా వెంకటేష్ ఇప్పడే ప్రకటించారు.
సక్సెస్ మీట్ లో సీక్వెల్ పై హింట్
తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్ లో చిత్ర బృందం పాల్గొంది. అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ తో తెరపై అదే మ్యాజిక్ ను మళ్లీ సృష్టించడానికి తిరిగి రాబోతున్నామని అనౌన్స్ చేశారు. 2027 పొంగల్ పండగ సందర్భంగా ఈ 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ రిలీజ్ కానుందని ప్రకటించి, వెంకటేష్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఇదివరకే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు. కాగా 'సంక్రాంతికి వస్తున్నాం' పార్ట్ 2 కు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వెంకటేష్ దగ్గుబాటి హీరోగా నటించగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ గా, ఐశ్వర్య రాజేష్ ఆయన భార్యగా, మీనాక్షి చౌదరి వెంకటేష్ ప్రియురాలి పాత్రను పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.
ఇటీవల కాలంలో సినిమాలని థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ తర్వాత టెలివిజన్లోకి అడుగు పెడుతున్నాయి. కానీ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ మాత్రం కొత్త ట్రెండుని మొదలు పెట్టింది. ఈ మూవీ ముందుగా టీవీలో, ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ జీ తెలుగులో ప్రసారం కాబోతోందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. స్వయంగా చిరంజీవి 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమ్మర్ లో ఈ మూవీని మొదలు పెట్టబోతున్నామని వెల్లడించారు. అలాగే ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, కొణిదెల సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు చిరు వెల్లడించారు. ఈ మూవీ పూర్తయ్యాకే అనిల్ రావిపూడి మళ్లీ 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై దృష్టి సారించే అవకాశం ఉంది. మరి ఈలోగా వెంకటేష్ ఏదైనా మూవీని చేస్తారా ? లేదంటే అనిల్ రావిపూడి కోసం వెయిట్ చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: మూవీ లవర్స్‌కు నిజంగా 'వాలెంటైన్స్ డే' - అటు థియేటర్ ఇటు ఓటీటీల్లో ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేయండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

