అన్వేషించండి

Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది హైదరాబాద్ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం

Jabalpur Road Accident | కుంభమేళాకు వెళ్లి వస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఏపీకి చెందిన ఏడుగురు వ్యక్తులు మృతిచెందడంతో విషాదం నెలకొంది.

Madhya Pradesh Road Accident | భోపాల్: మహాకుంభమేళా యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ లోని సిహోరా వద్ద బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంభమేళా భక్తులు ఏడుగురు మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం 9:15 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి (30) మీద మోహ్లా బార్గి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

మొదట మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని భావించారు. వారి వద్ద ఉన్న వివరాలు పరిశీలిస్తే హైదరాబాద్ లోని నాచారానికి చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతులను సంతోష్, శశికాంత్, నవీన్, బాలకృష్ణ, రవి, ఆనంద్‌లుగా గుర్తించారు. వీరు నాచారంలోని రాఘవేంద్ర నగర్‌, కార్తికేయ నగర్ కు చెందినవారు అని మధ్యప్రదేశ్ పోలీసులు సమాచారం ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లోని నాచారానికి చెందిన కొందరు భక్తులు ఓ ప్రైవేట్ వాహనంలో కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం NH-30పై  మోహ్లా-బార్గి వంతెన సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఏడుగురు ఏపీ వాసులు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జబల్‌పూర్ కలెక్టర్, జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి పరిశీలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా జబల్పూర్ లోని సిహోరా బైపాస్ వద్ద 10 నుంచి 15 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వేల వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయి ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రమాదానికి గురైన వాహనం నెంబర్ ఏపీ29 W 1525 గా ఉండటం చూసి మినీ బస్సు ఏపీకి చెందినదిగా భావించారు. బాధితులను సంప్రదించగా, వారు హైదరాబాద్ లోని నాచారం నుంచి కుంభమేళాకు వచ్చి వెళ్తున్నారని జబల్‌పూర్ పోలీసులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget