అన్వేషించండి

Mahesh Babu: దుబాయ్‌లో బాలీవుడ్ సెలబ్రిటీలతో మహేష్ బాబు జంట సందడి - ‘1 నేనొక్కడినే’ జోడీని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Mahesh Babu in Dubai: టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి దుబాయ్ చెక్కేశారు. అక్కడ వీరంతా కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu Namrtha New Year 2024 Party : న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సినీ సెలబ్రిటీలు అంతా విదేశాలకు క్యూ కట్టారు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ దుబాయ్, ప్యారిస్‌లాంటి ప్రాంతాల్లో న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లిపోయారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కృతి సనన్, తన సోదరి నుపూర్ సనన్, వరుణ్ ధావన్, తన భార్య నటాషాతో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన భార్య నమత్ర కూడా దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. వీరితో పాటు ఇండియన్ క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోనీ, తన భార్య సాక్షి కూడా దుబాయ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫన్ లంచ్‌తో పాటు గప్‌షప్స్..
దుబాయ్‌లో అందరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు వరుణ్ ధావన్. ఒక సెల్ఫీలో తనతో పాటు తన భార్య నటాషా దలాల్, హీరోయిన్ కృతి సనన్‌తో పాటు మహేశ్, నమ్రత కూడా ఉన్నారు. ముందుగా ఇదే ఫోటోను నమ్రత.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ‘‘2023 చివర్లో.. ఫన్ లంచ్, గప్‌షప్స్‌తో. మరోసారి కలిసేవరకు’’ అంటూ వారి ఫన్ టైమ్ గురించి చెప్తూ క్యాప్షన్ కూడా పెట్టింది. దాంతో పాటు హగ్ ఎమోజీలు కూడా వీటికి యాడ్ చేసింది. ఆ న్యూ ఇయర్ పార్టీలో పాల్గొన్న ఇతర సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను కూడా రీషేర్ చేశాడు వరుణ్ ధావన్. ఇందులో వారంతా ఫుల్ పార్టీ మూడ్‌లో కనిపిస్తున్నారు. మహేష్ బాబు, కృతి సనన్‌ ‘1 నేనొక్కడినే’ సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మళ్లీ వారిని జంటగా చూడటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సినీ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు కూడా..
గతేడాది వరుణ్ ధావన్, తన భార్య నటాషా కలిసి న్యూ ఇయర్‌ను సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం అందరు సెలబ్రిటీలతో కలిసి దుబాయ్‌లో వారి న్యూ ఇయర్ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక ఈ ఏడాదికి తన భార్య నటాషాతో దిగిన ఫోటోను షేర్ చేసిన వరుణ్.. ‘బాయ్ చెప్పకండి, హాయ్ 2024’ అని చెప్పండి అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక సినీ సెలబ్రిటీలు చేసుకున్న ఈ పార్టీలో పలువురు క్రికెటర్లు కూడా కనువిందు చేశారు. ఎమ్‌ఎస్ ధోనీ, సాక్షితో పాటు రిషబ్ పంత్ కూడా దుబాయ్‌లోనే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించాడు. యాక్సిడెంట్ నుంచి బయటపడిన తర్వాత రిషబ్.. ఎక్కువగా ధోనీతోనే కనిపిస్తున్నాడు. ఇక న్యూ ఇయర్‌ను కూడా ధోనీ ఫ్యామిలీతోనే కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా..
వీరందరి మధ్య ఒక సోషల్ మీడియా స్టార్ కూడా దుబాయ్‌లోనే న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పాడు. తనే అబ్దూ రోజిక్. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అబ్దూ రోజిక్.. తన న్యూ ఇయర్ స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వరుణ్ ధావన్‌కు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. దానికి వరుణ్ కూడా పాజిటివ్‌గా రిప్లై ఇచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎవరికి వారు తమ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగానే ఉన్నారు. కానీ న్యూ ఇయర్ కాబట్టి అందరూ తమ షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చేసి ఫ్యామిలీతో వేడుకలు చేసుకోవానికి దుబాయ్ చెక్కేశారు. ఇక ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లాలన్నా, వారితో కలిసి ఎక్కువ సమయాన్ని గడపాలన్నా మహేశ్ బాబు ఎప్పుడూ ముందుంటారు. అందుకే వారితో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ‘గుంటూరు కారం’ షూట్‌కు బ్రేక్ ఇచ్చాడు. 

Also Read: గుండె తరుక్కుపోతోంది, జపాన్ ప్రజలూ ధైర్యంగా ఉండండి - ఎన్టీఆర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget