అన్వేషించండి

Bhogi First Look: ఆగస్టులో శర్వానంద్ 'భోగి'... ఫస్ట్ లుక్ చూశారా? రిలీజ్ డేట్ ఇదుగో!

Sharwanand Look In Bhogi: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సినిమా 'భోగి'. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

సంక్రాంతికి 'నారి నారి నడుమ మురారి'తో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand). తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన... ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశారు. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' సినిమా చేస్తున్నారు. ఇవాళ ఆ సినిమాలో శర్వానంద్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

'భోగి'లో శర్వా లుక్ చూశారా?
శర్వానంద్, సంపత్ నంది కలయికలో రూపొందుతున్న మొదటి సినిమా 'భోగి'. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం మీద శ్రీమతి లక్ష్మి రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవాళ సినిమాలో ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 

'భోగి' ఫస్ట్ లుక్ చూస్తే... శర్వానంద్ రగ్గడ్, ఫిరోషియస్ ఎక్స్‌ప్రెషన్‌లో కనిపించారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ స్పష్టంగా కనబడుతోంది. 'నారి నారి నడుమ మురారి'లో లవర్ బాయ్ పాత్రలో హ్యాండ్సమ్ లుక్కులో కనిపించిన ఆయన... ఇప్పుడు మాస్ హీరో అవతార్ చూపించారు. 

'భోగి' ఫస్ట్ లుక్కులో సినిమా ఎంత మాసీగా ఉండబోతుందో చూపించారు. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' తరహాలో డార్క్ టోన్ సినిమాటోగ్రఫీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో వయలెన్స్ పార్ట్ ఎక్కువ ఉంటుందట. ఈ సినిమాకు ఏ 'బ్లడీ ఫెస్ట్' అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి రగ్గడ్ రోల్ ఈ సినిమాలో శర్వా చేస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది.

Also ReadBalakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

'భోగి' నేపథ్యం ఏమిటి?
ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల నేపథ్యంలో 'భోగి' కథ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. పవర్ ఫుల్ కథతో 1960 నేపథ్యంలో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సంపత్ నంది కథ రాశారట. 

'భోగి' సినిమాలో శర్వానంద్ సరసన అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో మేజర్ యాక్షన్ సీక్వెన్సులు షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రెండు యాక్షన్ సీక్వెన్సులు తీయనున్నారు. వీటికి దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Also ReadNTR - Ravi Teja: ర‌వితేజతో అనౌన్స్ చేశారు... ఎన్టీఆర్‌తో సినిమా చేశారు... కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా బ్యాక్‌స్టోరీ తెలుసా?

ఈ ఏడాది ఆగస్టు 28న 'భోగి'ని థియేటర్లలోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'భోగి'ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. 

శర్వానంద్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న 'భోగి' చిత్రాన్ని రచన - దర్శకత్వం: సంపత్ నంది, నిర్మాత: కేకే రాధామోహన్, నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం: కిశోర్ కుమార్ ఆరోకియా, కళా దర్శకుడు: కిరణ్ కుమార్ మన్నే, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్.

Also Read: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం వెబ్ సిరీస్ టైటిల్ ఫిక్స్... కడప నేపథ్యంలో!

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget