అన్వేషించండి

Shahid Kisses Vijay Devarakonda: 'అర్జున్ రెడ్డి’కి ముద్దు పెట్టిన ‘కబీర్ సింగ్’ - అమెజాన్ వేడుకలో షాహీద్, విజయ్ సందడి

'కబీర్‌ సింగ్‌', 'అర్జున్ రెడ్డి'లు ఒకే స్టేజ్‌పై సందడి చేశారు. నేడు ముంబైలో అమెజాన్‌ ప్రైం నిర్వహించిన ఈవెంట్‌లో టాలీవుడ్‌ 'రౌడీ' హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ హాజరయ్యారు.

Shahid Kapoor Kisses Vijay Devarakonda: 'కబీర్‌ సింగ్‌', 'అర్జున్ రెడ్డి'లు ఒకే స్టేజ్‌పై సందడి చేశారు. నేడు ముంబైలో అమెజాన్‌ ప్రైం ఓటీటీ సంస్థ నిర్వహించిన ఈవెంట్‌లో టాలీవుడ్‌ 'రౌడీ' హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో వారిద్దరు కలిసి  ఒకేసారి స్టేజ్‌ని పంచుకున్నారు. ఈ సందర్భంగా షాహిద్‌.. విజయ్‌పై అభిమానం కురిపిస్తు ముద్దు పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది. అంతేకాదు స్టేజ్‌పై వీరిద్దరు హగ్‌ చేసుకుని ఇద్దరు ఒకరిపై ఒకరు అభిమానం చాటుకున్నారు. అనంతరం షాహిద్ మాట్లాడుతూ.. "ఇప్పుడు నాకు అర్జున్‌ రెడ్డి అంటే అంత క్రేజ్‌ ఎందుకనేది.

నిజానికి ఈ అర్జున్‌ రెడ్డి అనే ఈ పాత్ర విజయ్‌ చేయకపోయి ఉంటే 'కబీర్‌ సింగ్‌' అసలు పుట్టేవాడు కాదు. థ్యాంక్యూ విజయ్‌" అని పేర్కొన్నాడు. అంతేకాదు విజయ్‌కి ముద్దు పెడుతూ, అప్యాయంగా  హగ్‌ చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన ఇద్దరు హీరో ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్‌పై అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఫైనల్లీ అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగను పక్క పక్కన చూస్తున్నాం'అని ఓ నెటిజన్‌ కామెంట్స్‌ చేయగా మరోక యూజర్‌ రణ్‌బిర్‌ కపూర్‌ మిస్సింగ్‌ అంటూ కామెంట్‌ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

Also Read: ఒకే ఈవెంట్‌లో మెరిసిన నాగచైతన్య, సమంత - విడాకుల తర్వాత ఇదే ఫస్ట్‌టైం, ఫుల్‌ ఖుష్‌లో ఫ్యాన్స్‌

కాగా డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్‌ రెడ్డి' మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోల్డ్‌ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంటూనే బ్లక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఇందులో విజయ్‌ పర్ఫామెన్స్‌కి అంతా ఫిదా అయ్యారు. అతడి యాక్టింగ్‌కి విమర్శల ప్రశంసలు దక్కాయి. అప్పటికే పెళ్లి చూపులు సినిమాతో కెరీర్‌ని నిలదొక్కుకుంటున్న విజయ్‌ని 'అర్జున్‌రెడ్డి' స్టార్‌ హీరోని చేసింది. ఈ మూవీకి విపరీతమైన బజ్‌, రెస్పాన్స్‌ రావడంతో ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్‌ చేశారు. అదే డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగ కబీర్‌ సింగ్‌ పేరుతో హిందీలో రీమేక్‌ చేశాడు. ఇందులో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించాడు. హిందీలోనూ ఈ మూవీ సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు వరస ప్లాప్స్‌ చూస్తున్న షాహిద్‌కు 'కబీర్‌ సింగ్‌' భారీ విజయం అందించింది. ఈ సినిమాకు హిందీలోనూ వివాదాలు, విమర్శలు వెంటాడిన బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. 

Also Read: Ram Charan Play With Daughter: వైజాగ్‌ బీచ్‌లో కూతురు క్లింకారతో చరణ్‌ సందడి - కనువిందు చేస్తున్న వీడియో

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget