Ram Charan Play With Daughter: వైజాగ్ బీచ్‌లో కూతురు క్లింకారతో చరణ్ సందడి - కనువిందు చేస్తున్న వీడియో
Ram Charan: 'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్‌కు బ్రేక్ దొరకడంతో భార్య ఉపాసన, కూతురితో కలిసి చరణ్ వైజాగ్ బీచ్‌లో సందడి చేశాడు. తన ముద్దల తనయతో కలిసి బీచ్‌లో ఆడుకుంటున్న వీడియో కనువిందు చేస్తుంది.
Ram Charan Play With Daughter at Vizag Beach: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖపట్నం వెళ్లిన చరణ్‌కు అక్కడి అభిమాలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో చరణ్‌కు వెల్‌కమ్ చెప్పారు. అక్కడ వైజాగ్ బీచ్ సమీపంలో మూవీ షూటింగ్ జరగ్గా సెట్స్‌లోని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఇందులో చరణ్ లుక్ బయటకు రాగా అవి ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ చరణ్ గేమ్ ఛేంజర్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లిన చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లింకారను కూడా తన వెంటన తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. షూటింగ్‌కు కాస్తా బ్రేక్ దొరకడంతో ఉపాసన, క్లింకారలతో కలిసి చరణ్ వైజాగ్ బీచ్‌లో సందడి చేశాడు. తన ముద్దల తనయతో కలిసి బీచ్ వ్యూని ఎంజాయ్ చేశాడు.
క్లింకార ఫస్ట్ బీచ్ ఎక్స్ పీరియన్స్
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది. "వైజాగ్.. మా మనసులను గెలుచుకున్నావ్. క్లింకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్‌పిరియన్స్" అంటూ ఉపాసన తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో చరణ్ తన కూతురుని ఎత్తుకుని బీచ్ ఒడ్డున ఆటాలాడుతూ కనిపించాడు. దాదాపు నిమిషంకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో చరణ్ కూతురితో కలిసి సరదా సమయాన్ని గడిపాడు. చరణ్ క్లింకారతో ఆడుతుంటే వారి చూస్తూ ఉపాసన మురిసిపోయింది. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఇదే వీడియో చివరిలో రామ్ చరణ్ వైజాగ్ వచ్చిన సందర్భంగా అభిమానులు ఆయనకు గజమాలతో సత్కరించిన వీడియోను కూడా జోడించింది.
View this post on Instagram
కాగా గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ ఉప్పెన 'డైరెక్టర్' బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 మూవీ చేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు పూజ కార్యక్రమం జరగనుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిట్‌ను పరిశీలిస్తున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరి రేపు rc16 పూజ కార్యక్రమం సందర్భంగా మూవీ టైటిల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల ఉపాసన తన తాతా ప్రతాప్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య సందర్శించిన సంగతి తెలిసిందే అయోధ్య రామ మందిరంలోని బాలరాముడిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా త్వరలో అయోధ్య రామమందిరంలో అపోలో సేవలను ప్రారంభించనున్న తరుణంలో వారంత అయోధ్య సందర్శించినట్టు సమాచారం.