Samantha : సెకండ్ హ్యాండ్ ట్యాగ్ ఇచ్చారు.. నాగ చైతన్య - శోభిత పెళ్లికి ముందు డివోర్స్ ట్రోలింగ్‌పై సామ్ కామెంట్స్
Samantha Ruth Prabhu : సమంత విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. తనకు సెకండ్ హ్యాండ్ అంటూ ట్యాగ్ లు ఇచ్చారని ఆవేదనను వ్యక్తం చేసింది.
Samantha Ruth Prabhu on Divorce Trolling : సౌత్ క్వీన్ సమంత తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విడాకులు ప్రకటించిన సమయంలో తనపై దారుణంగా కామెంట్స్ చేశారని గుర్తు చేసుకుంది సమంత. తాజా ఇంటర్వ్యూలో ఆ కామెంట్స్ ఏంటో కూడా చెప్పి ఆవేదనను వ్యక్తం చేసింది. మయోసైటిస్ కారణంగా సినిమాల నుంచి కొంతకాలం గ్యాప్ తీసుకున్న సమంత... రీసెంట్ గా 'సిటాడెల్ : హనీ బన్నీ'తో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్ లో సమంత హీరోయిన్ గా కనిపించింది. తాజాగా దీనికి సంబంధించి ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ డివోర్స్ గురించి ఓపెన్ అయింది.
నాగ చైతన్యతో తన విడాకుల విషయాన్ని, ఆ సమయంలో తనపై జరిగిన ట్రోలింగ్ పై స్పందించింది. ఆ ట్రోలింగ్ గురించి ఎదురైన ప్రశ్నకి సమంత రియాక్ట్ అవుతూ "మ్యారేజ్ రిలేషన్ షిప్ బ్రేక్ అయితే ఎందుకు మహిళల్ని మాత్రమే నిందిస్తారు? ఆ టైంలో నాపై ఎన్నో ఫేక్ వార్తలను ప్రచారం చేశారు. ఏకంగా యూజ్ లెస్, సెకండ్ హ్యాండ్, లైఫ్ వేస్ట్ అంటూ సోషల్ మీడియాలో టాగ్స్ లు కూడా ఇచ్చారు. అలాంటి మాటలు మనుషుల్ని బాధ పెడతాయని ఒక్కసారి కూడా ఆలోచించరా? ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం... ఏం చేస్తాం? ఆ క్లిష్ట సమయంలో నాకు నా స్నేహితులు, ఫ్యామిలీ అండగా నిలిచారు.
పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే చాలు ఫెయిల్యూర్ గా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే మహిళలు, వాళ్ళతో పాటు వారి కుటుంబాలకు కూడా కష్టంగా ఉంటుంది. నాపై వచ్చిన రూమర్స్ నిజం కాదని చాలాసార్లు చెప్పాలనిపించింది. కానీ అలా చెప్పడం వల్ల ఉపయోగం ఉండదని ఆగిపోయాను" అంటూ తాజా ఇంటర్వ్యూ చెప్పుకొచ్చింది సమంత. నాగ చైతన్య, సమంత 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2021 లో ఈ జంట అభిప్రాయ భేదాల వల్ల డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత సమంత ఒంటరిగా ఉంటూ బాలీవుడ్ పై ఫోకస్ చేసింది.
అంతేకాకుండా నాగ చైతన్య - శోభితను రెండో వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు వినిపించగానే, తన పెళ్లి గౌనుని రీ మోడలింగ్ కూడా చేయించింది. పైగా దానికి రియాక్ట్ అవుతూ తాను కోపంతో ఆ పని చేయలేదని, కానీ ఎక్కడ ముగించామో అక్కడే కొత్తగా మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే గౌనును రీమోడలింగ్ చేయించనని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు నాగ చైతన్య డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో సమంత ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. రీసెంట్ గా తన ఎక్స్ కు ఇచ్చిన గిఫ్ట్ లు వేస్ట్ అంటూ సమంతా చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అంతలోపే సమంత తన విడాకులపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ మరోసారి వార్తల్లో నిలిచింది.
Read Also : "కాంతారా చాప్టర్ 1" ఆర్టిస్టుల బస్సు బోల్తా... ప్రమాదంలో ఆరుగురికి గాయాలు