Samantha: ట్రెండింగ్‌లో సమంత - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్
Samantha Ruth Prabhu: సమంత ప్రస్తుతం 'శుభం' మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కొత్త ప్రాజెక్టు గురించి అప్ డేట్ ఇచ్చారు. వరుస ప్రాజెక్టులతో అలరించనున్నారు.

Samantha New Movie Update Gone Viral: సమంత (Samantha) నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్'లో 'శుభం' (Subham) మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో సమంత బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వరుస ఇంటర్వ్యూలు, ఫోటోలతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పేరు ట్రెండింగ్ అవుతోంది.
జూన్‌లో కొత్త మూవీ
'శుభం' సినిమాలో సమంత డిఫరెంట్ రోల్‌లో నటించారు. 'శుభం' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె పంచుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించి దాదాపు ఏడాది దాటింది. గతేడాది ఆమె పుట్టినరోజు సందర్భంగా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) సినిమాను ప్రకటించారు. తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు చెప్పారు. అలాగే, 'రక్త్ బ్రహ్మాండ్'లో నటిస్తున్నారు. వీటి తర్వాత వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
Also Read: నిర్మాతగా 'సమంత' హిట్ కొట్టారా? - 'శుభం' మూవీ మెప్పించిందా?.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
అందుకే గెస్ట్ రోల్‌లో..
ఈ సినిమాలో సమంత గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. తాను గెస్ట్ రోల్ చేయాల్సింది కాదని.. కానీ నిర్మాతగా నా ఫస్ట్ మూవీలో ఎవరినీ సాయం అడగాలనుకోలేదని సమంత తెలిపారు. 'ఎవరినీ సాయం అడిగే ఉద్దేశం లేకే నేను నా సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించాను. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. రిలీజ్ వరకూ మాత్రమే ప్రచారం చేస్తా. ఆ తర్వాత సినిమా పూర్తిగా ఆడియన్స్ చేతుల్లోకి వెళ్తుంది.' అని అన్నారు.
ఆ ఫోటోలు వైరల్
ఈ సందర్భంగా సమంత పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాతగా ఆమె ఫస్ట్ మూవీ కావడంతో పూర్తి స్థాయిలో ప్రమోషన్లలో బిజీ అయ్యారు. 'శుభం' టీంతో పాటు దర్శకుడు రాజ్, దర్శకురాలు నందినిలతో దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 'ఇది చాలా కష్టమైన ప్రయాణం. ఇక్కడి వరకూ చేరుకున్నాం. ఇది కొత్త ఆరంభం' అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆసక్తిగా మారింది.
వెన్నెల కిశోర్‌తో ఫన్ వీడియో
కమెడియన్ వెన్నెల కిశోర్‌తో కలిసి సమంత చేసిన ఫన్ వీడియో ఆకట్టుకుంటోంది. 'నా శుభం మూవీ ప్రీమియర్స్‌కు రావట్లేదా?' అని ప్రశ్నించగా.. తాను నటించిన '#సింగిల్' మూవీ రిలీజ్ కూడా అదే రోజంటూ చెప్పబోతాడు వెన్నెల కిశోర్. అయితే, ఆయనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా.. 'నువ్వు నీ ఫ్యామిలీ తప్పకుండా వస్తారు కదా?. నేను నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది తప్పకుండా రావాలి. నువ్వు కచ్చితంగా వస్తున్నావ్.' అంటూ అతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కట్ చేసేస్తుంది. ఈ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. 'సింగిల్ ఫోన్ కాల్‌లో వెన్నెల కిశోర్‌కు 'శుభం' మూవీ చెప్పేశాను.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు సమంత.
View this post on Instagram





















