Saif Ali Khan Assault Case: సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు 11 ఏండ్ల తర్వాత మళ్లీ విచారణ, శిక్ష ఖరారు అయ్యేది ఎప్పుడో?
2012లో సైఫ్ అలీ ఖాన్ ఓ వ్యాపారవేత్తపై దాడికి పాల్పడ్డాడు. తాజ్ హోటల్లో జరిగిన ఈ ఘటనలో అమృతా అరోరా భర్త షకీల్ లడక్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త, అతడి బావపై ముంబైలోని ఓ హోటల్లో సైఫ్ అలీ ఖాన్ దాడి చేసిన 11 ఏండ్ల తర్వాత... ఈ కేసు విచారణ వచ్చే నెల (జూన్) నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ముంబై ఎస్ప్లానేడ్ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఏప్రిల్ 24న ఖాన్, అతడి స్నేహితులు షకీల్ లడక్, బిలాల్ అమ్రోహిలపై అభియోగాలను చదివి వినిపించారు. సాక్ష్యాధారాల నమోదు కోసం సమన్లు కూడా జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
దాడి రోజు ఏం జరిగిందంటే?
ఫిబ్రవరి 22, 2012 రోజున తాజ్ హోటల్‌లోని వాసాబి రెస్టారెంట్‌లో గొడవ జరిగింది. ఈ గొడవలో వ్యాపారవేత్త ఇక్బాల్ మీర్ శర్మతో పాటు అతడి బంధువులపై సైఫ్ అలీ ఖాన్, అతడి స్నేహితులు దాడి చేశారు. ఇక్బాల్ మీర్ శర్మదాఖలు చేసిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. గొడవ సమయంలో సైఫ్ అలీ ఖాన్‌తో పాటు అతడి భార్య, నటి కరీనా కపూర్, ఆమె సోదరి కరిష్మా కపూర్, నటులు మలైకా అరోరా ఖాన్, అమృతా అరోరా మరికొంతమంది స్నేహితులు ఉన్నారు. పోలీసుల ప్రకారం.. నటుడు సైఫ్ అలీ ఖాన్, అతడి స్నేహితులు హోటల్లో పెద్దగా అరిచారు. పక్కనే ఉన్న శర్మ అరుపులను ఆపాలని కోప్పడ్డారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ వారిని బెదిరించాడు. అంతటితో ఆగకుండా శర్మ మీద దాడి చేశాడు. సైఫ్, అతడి స్నేహితులు శర్మ బావ రమణ్ పటేల్‌ను కూడా కొట్టారు. మరోవైపు శర్మ తమను రెచ్చగొట్టినందుకే దాడి చేసినట్లు సైఫ్ అలీ ఖాన్ వివరించారు. తనతో పాటు ఉన్న మహిళలపై అనుచిత పదజాలంతో తమకు కోపం వచ్చిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డిసెంబర్ 21, 2012న ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సైఫ్ అలీ ఖాన్, అతడి ఇద్దరు స్నేహితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 325, 34 కింద అభియోగాలు నమోదు చేశారు.
Also Read : సీక్వెల్‌తో ఇస్మార్ట్ కాంబో ఈజ్ బ్యాక్ - పూరి దర్శకత్వంలో రామ్ 'డబుల్ ఇస్మార్ట్'
సైఫ్ దంపతులపై ఉమైర్ సంధు సంచలన ట్వీట్
తాజాగా సినీ క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కఫూర్ గురించి సంచలన ట్వీట్ చేశారు. కరీనా, సైఫ్ మధ్య పెద్ద గొడవ జరిగిందంటూ బాంబు పేల్చారు. ఈ గొడవలో కరీనా కపూర్ భర్త ముఖం మీద తీవ్ర స్థాయిలో దాడి చేసినట్లు వెల్లడించారు. ఊహించని రేంజ్ లో వారిద్దరి మధ్య గొడవ జరిగింది అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అయితే, ఉమైర్ సంధు గత కొంత కాలంగా పలు వివాదాస్పద ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ లోని నిజా నిజాలు ఏంటనే నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
View this post on Instagram
Read Also: రియల్ లైఫ్‌లో శ్రీమంతుడిలా శివన్న దంపతులు - కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలను...