By: ABP Desam | Updated at : 14 May 2023 04:11 PM (IST)
పూరి జగన్నాథ్, రామ్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath)లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్! వాళ్ళిద్దరూ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ సినిమా ఎండింగులోనే దానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. తామిద్దరం కలిసి మరో సినిమా చేస్తామని రామ్, పూరి అనౌన్స్ చేశారు కూడా! ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ కుదిరింది.
'డబుల్ ఇస్మార్ట్'... ఇది సీక్వెల్ గురూ!
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాకు 'డబుల్ ఇస్మార్ట్' (Double ISMART Movie) టైటిల్ ఖరారు చేశారు. ఇది 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ అన్నమాట. సినిమాను అనౌన్స్ చేయడంతో పాటు థియేటర్లలో ఎప్పుడు విడుదల చేసేదీ చెప్పేశారు. వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చెప్పారు (Double ISMART Release Date). పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు.
The ENERGETIC combo of
— Charmme Kaur (@Charmmeofficial) May 14, 2023
Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh is
BACK with ISMART BANG for#DoubleISMART 🔥
A high octane action entertainer in cinemas from MARCH 8th 2024
In Telugu, Hindi, Tamil, Malayalam, Kannada#HappyBirthdayRAPO@PuriConnects pic.twitter.com/mhMC2lt4Yb
'ఇస్మార్ట్ శంకర్'లో హైదరాబాదీ యువకుడిగా రామ్ పోతినేని సందడి చేశారు. ఇక, సినిమాలో తెలంగాల యాసలో ఆయన చెప్పిన డైలాగులు పాపులర్ అయ్యాయి. రామ్ నటన, పూరి మార్క్ డైలాగులు & దర్శకత్వానికి తోడు మణిశర్మ సంగీతం సైతం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడీ సినిమాకు కూడా ఆయన్ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.
Also Read : భద్రాచల రామయ్యకు వెండితెర రామయ్య 'ఆదిపురుష్' ప్రభాస్ విరాళం - ఎంత ఇచ్చారంటే?
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ పోతినేని రెండు సినిమాలు విడుదల చేశారు. 'రెడ్', 'ది వారియర్' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారు. పుట్టినరోజు సందర్భంగా రేపు ఆ సినిమా గ్లింప్స్ (Boyapati Rapo movie first thunder) విడుదల కానుంది. ఆల్రెడీ అందులో రామ్ లుక్ విడుదల చేశారు. అది మాసీగా ఉంది. ఇక, బుల్ ఫైట్స్ సీన్స్ అయితే ఊర మాస్ అనేలా ఉంటాయని యూనిట్ చెబుతోంది. అది పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమానూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ప్లాన్ చేశారట.
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?