News
News
వీడియోలు ఆటలు
X

Prabhas Donation To Temple : భద్రాచల రామయ్యకు వెండితెర రామయ్య 'ఆదిపురుష్' ప్రభాస్ విరాళం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి హీరో ప్రభాస్ విరాళం అందజేశారు.

FOLLOW US: 
Share:

భద్రాచలంలోని రామయ్యకు వెండితెరపై త్వరలో రాముడిగా కనిపించనున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం అందజేశారు. ఆయన ఆత్మీయ మిత్రునితో చెక్కును దేవాలయ అధికారులకు అందజేశారు. అసలు వివరాల్లోకి వెళితే... 

పది లక్షల విరాళం అందజేసిన ప్రభాస్
భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం (Bhadrachalam Sri Seetha Rama Swamy Temple) ఎంతో ప్రసిద్ధి చెందినది. ప్రతి ఏడాది అక్కడ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. ఆ ఆలయానికి కథానాయకుడు ప్రభాస్ రూ. పది లక్షలను విరాళంగా అందజేశారు. ఈవో రమాదేవికి ప్రభాస్ మేనమామ సత్యనారాయణ రాజు 10 లక్షల చెక్కును అందజేశారు.

ఆదిపురుషుడిగా రానున్న ప్రభాస్
త్వరలో వెండితెరపై శ్రీరామ చంద్ర మూర్తి పాత్రలో ప్రభాస్ (Prabhas) కనువిందు చేయనున్నారు. హిందీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్'లో మర్యాదా పురుషోత్తముడు ప్రభు శ్రీరామ్ పాత్రలో ఆయన నటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

Also Read : సొసైటీ కోసం ప్రెగ్నెంట్ కాలేదు, నాకు నచ్చినప్పుడు, రెడీగా ఉన్నప్పుడు బిడ్డకు జన్మ ఇవ్వాలని... మదర్స్ డేకి ఉపాసన సెన్సేషనల్ పోస్ట్ 

'ఆదిపురుష్' సీతాదేవిగా కృతి సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశునిగా సైఫ్ అలీ ఖాన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న త్రీడీలో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది.

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలకు వస్తే... ఆయన చేతిలో నాలుగు ఐదు భారీ సినిమాలు ఉన్నాయి. 'సలార్' చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. 'ఆదిపురుష్' విడుదలైన తర్వాత... సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో 'సలార్' తొలి భాగం విడుదల కానుంది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందో మరి!? 'సలార్' సినిమా ఒక భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రెండు పార్టులుగా విడుదల అవుతుందా? అని నిన్న మొన్నటి వరకు సందేహాలు నెలకొన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ గానీ, ప్రభాస్ గానీ, నిర్మాతలు గానీ ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్నడ నటుడు దేవరాజ్ 'సలార్' రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిపారు.

Also Read : వెంకీతో దుల్కర్ సల్మాన్ - అక్టోబర్‌లో సెట్స్‌కు, సమ్మర్‌లో థియేటర్లకు!

ప్రస్తుతం మారుతి సినిమా షూటింగ్ చేస్తున్నారు ప్రభాస్. ఇంకా సిద్ధార్థ్ ఆనంద్, సందీప్ రెడ్డి వంగా సినిమాలు లైనులో ఉన్నాయి.  మారుతి సినిమాకు 'రాజా డీలక్స్' టైటిల్ ఖరారు చేశారట. ఇంకా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. 

బహుశా 'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత వచ్చిన ట్రోల్స్ ఇతర సినిమాల టీజర్లు విడుదలైనప్పుడు రాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు కూడా ఆ టీజర్ నచ్చలేదు. 'ఆదిపురుష్' ట్రైలర్ (Adipurush Trailer) విషయంలో అటువంటి విమర్శలు రాలేదు. రాఘవ రామునిగా బాక్సాఫీస్ కుంభస్థలానికి ప్రభాస్ గురి పెట్టారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, కంటెంట్ విషయంలో చిత్ర బృందానికి కాంప్లిమెంట్స్ వచ్చాయి. 

Published at : 14 May 2023 12:22 PM (IST) Tags: Adipurush Movie Prabhas Bhadrachalam Temple Sita Ramachandraswamy Temple Bhadrachalam Temple EO Rama Devi Prabhas Donates 10 Lakhs

సంబంధిత కథనాలు

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

టాప్ స్టోరీస్

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!