By: ABP Desam | Updated at : 14 Sep 2021 03:58 PM (IST)
కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ పెళ్లయ్యాక కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా చేస్తూనే ఉంది. ప్రస్తుతం చిరంజీవి సినిమా ‘ఆచార్య’, నాగార్జున సినిమా ‘ఘోస్ట్’లో నటిస్తోంది. ఈ సినిమాల షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని భావిస్తోందట కాజల్. ఆ తరువాత ఏ సినిమా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదట అందాల చందమామ. దానికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే నెటిజన్లు ఈ విషయంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ రూమర్లు చక్కర్లు కొడుతున్నా కాజల్ నోరు విప్పడం లేదు. నిజానికి ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ రూమర్లను చూస్తూ కూడా కాజల్ స్పందించడం లేదు. దీంతో ఆ వార్తలు నిజమేనా అని అనుమానిస్తున్నారు కాజల్ అభిమానులు.
గతంలో పెళ్లి అయిన తరువాత కొంతమంది ఆమె అభిమానులు ‘మీరు ఎప్పుడు తల్లి కావాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. దానికి కాజల్ తన వ్యక్తిగత వ్యవహారాలను బయటపెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పింది. పెళ్లి అయ్యాక కాజల్ తో పాటూ భర్త గౌతమ్ కూడా కొన్ని షూటింగులకు తోడుగా వచ్చాడు. తన భర్త ఎప్పుడు సినిమాలు ఆపమంటే అప్పుడు ఆపేస్తానని చెప్పింది కాజల్. వీరిద్దరి తొలి మ్యారేజ్ యానివర్సిరీ అక్టోబర్ 20న జరగనుంది.
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా... కాజల్ అందానికి, నటనకు నమంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత ఆమె చేసినా ‘చందమామ’ సినిమా సూపర్ హిట్ కొట్టింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వరుసకట్టాయి. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలందరితోనూ జతకట్టి టాప్ హీరోయిన్ గా మారింది. మగధీర, డార్లింగ్, బాద్షా, గోవిందుడు అందరి వాడేలే.. లాంటి చాలా హిట్ మూవీల్లో నటించింది. పదేళ్ల క్రితం పరిచయమై స్నేహితుడిగా ఆపై ప్రేమికుడిగా మారిన గౌతమ్ ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. మాల్టీవులకు హనీమూన్ కు కూడా వెళ్లారు.
Also read: నటరాజ్ చెప్పిన ఆ గుంట నక్క రవియేనా..?
Also read: ఇలాంటి తండ్రికి పుట్టిన ఆ కూతురు ఎంత అదృష్టవంతురాలో...
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి... వైద్యుడిని కలవండి
Also read: అదిరే అందంతో విష్ణుప్రియ... చూస్తే వావ్ అనాల్సిందే
Also read: రోజుకో రెండు తమలపాకులు నమలండి... ఈ రోగాలు దరిచేరవు
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!