X
Match 7 - 20 Oct 2021, Wed up next
NAM
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 8 - 20 Oct 2021, Wed up next
SL
vs
IRE
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Betel Leaf: రోజుకో రెండు తమలపాకులు నమలండి... ఈ రోగాలు దరిచేరవు

పూజల్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనో లేక భోజనం చేశాక కిళ్లీల రూపంలోనో తమలపాకులను తింటాం. కానీ వాటిని రోజూ తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా?

FOLLOW US: 

రోజూ ఒక యాపిల్ తింటే వైద్యుడి అవసరం లేదంటారు... అలాగే రోజుకో రెండు తమలపాకులు నమిలినా వైద్యుడి అవసరం తక్కువే పడుతుందని కొన్ని ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మన పూర్వీకులు రోజూ తమలపాకుల్ని తినేవారంట. ఆధునిక కాలంలో మాత్రం వీటి ఉపయోగం చాలా తగ్గిపోయింది. అందులో దీన్ని పాన్ కింద లెక్కగట్టేస్తారు. అందుకే చాలా మంది దాని జోలికి కూడా పోరు. పొగాకు లేదా సున్నం, అరేకా గింజలు కలిపి తమలపాకులో చుట్టి నమిలితే పాన్ అవుతుంది. అవేవీ లేకుండా కేవలం తమలపాకు ఒక్కటి నమలండి చాలు... అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మేం ఇక్కడ తమలపాకు మాత్రమే నమలమని చెబుతున్నాం... పాన్ మాత్రం కాదు. 


తమలపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఈ విటమిన్ చాలా అవసరం. తమలపాకు తింటే విటమిన్ సి శరీరానికి అందుతుంది. అంతేకాదు ఇందులో కాల్షియం కూడా అధికంగా లభిస్తుంది. కాల్షియంలోపం ఉన్నవాళ్లు తమలపాకులో కాస్త సున్నం కలిపి తింటే పుష్కలంగా అందుతుంది. కానీ సున్నం రోజూ తినడం మంచిది కాదు. కనుక ఆకులకే పరిమితం అవ్వడం మంచిది. 


బాలింతలు తమలపాకులో వక్క పెట్టి, చిటికెడు సున్నం వేసి బాగా నమిలి మింగితే ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల శరీరంలో వేడి పెరగకుండా ఉంటుంది. ఈ ఆకులో పీచుపదార్థం కూడా ఉంటుంది. కనుక జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. మానసిక


చంటి పిల్లలకు జలుబు చేసినప్పుడు తమలపాకు రసాన్ని పిండి, రెండు చుక్కల ఆ రసాన్ని పాలల్లో కలిపి తాగిస్తే మంచిది. ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పెద్దలు కూడా ఈ మిశ్రమాన్ని తాగొచ్చు. 


తలనొప్పికి తమలపాకులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. నుదుటిపై తమలపాకుల రసంతో మర్ధనా చేస్తే మంచిఫలితం ఉంటుంది. 


డిప్రెషన్ వంటి మానసిక సమస్యల బారిన పడినవారు రోజూ తమలపాకులను తినడం అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు మానసిక వైద్య నిపుణులు. 


కొందరిలో ఆకలి తగ్గిపోతుంది. దీనివల్ల సరిగా తినకపోతే పోషకాహారలోపం కలగవచ్చు. అలాంటి వారు రెండు తమలపాకులు నమిలితే ఆకటి పుడుతుంది. 


Also read: ఇవి తినడానికీ ఓ టైముంది... ఎప్పుడు తినకూడదంటే...


Also read: గుడ్లు తిన్నాక... వీటిని తినకండి, తింటే ఏమవుతుందంటే...


Also read: వంటనూనె పసుపు రంగులో ఉందా? మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోండి

Tags: Health Benefits Mental Health Good food Betel leaves

సంబంధిత కథనాలు

Tic Disorder: బ్యాన్ అయిపోయింది కనుక బతికిపోయాం! లేకపోతే టిక్‌ టాక్‌తో 'టిక్స్' రోగం!

Tic Disorder: బ్యాన్ అయిపోయింది కనుక బతికిపోయాం! లేకపోతే టిక్‌ టాక్‌తో 'టిక్స్' రోగం!

Bacteria in Beard: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

Bacteria in Beard: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

Tightrope Village: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం

Tightrope Village: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం

Warm milk: పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలు తాగమని ఎందుకు చెబుతారు?

Warm milk: పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలు తాగమని ఎందుకు చెబుతారు?

Height Declining: అయ్యో... భారతీయుల ఎత్తు తగ్గిపోతోందట

Height Declining: అయ్యో... భారతీయుల ఎత్తు తగ్గిపోతోందట

టాప్ స్టోరీస్

Chandrababu : ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !

Chandrababu : ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..!  అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !

TDP Vs YSRCP: టీడీపీ కార్యాలయాలపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

TDP Vs YSRCP: టీడీపీ కార్యాలయాలపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

Breaking Updates Live: యాదాద్రి పునః ప్రారంభం ముహూర్తం ఖరారు... తేదీ ప్రకటించిన సీఎం కేసీఆర్

Breaking Updates Live:  యాదాద్రి పునః ప్రారంభం ముహూర్తం ఖరారు... తేదీ ప్రకటించిన సీఎం కేసీఆర్

Romantic Trailer: ‘రొమాంటిక్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్.. ప్రేమను మోహం అనుకుంటున్నారట!

Romantic Trailer: ‘రొమాంటిక్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్.. ప్రేమను మోహం అనుకుంటున్నారట!