అన్వేషించండి

Hema Malini: హేమమాలిని పుట్టినరోజు వేడుకల్లో రేఖా అల్లరి - బుగ్గలు గిల్లుతూ, ముద్దులు పెడుతూ!

హేమమాలిని, రేఖా అంటే ఒకప్పుడు ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్సే. అలాంటి ఈ ఇద్దరి చాలారోజుల తర్వాత ఒక వేదికపై సందడి చేశారు.

ఒకప్పుడు హీరోయిన్లుగా నటించిన కొందరు తారలు క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. 90ల్లో హీరోయిన్స్ అంటే ఆ క్రేజే వేరే. టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో కూడా ఇంకా 90ల్లోని హీరోయిన్లు అదే అందంతో చెక్కుచెదరకుండా ఉన్నారు. తాజాగా హేమామాలిని తన 75వ పుట్టినరోజును జరుపుకుంది. తన పుట్టినరోజు కోసం గ్రాండ్‌గా ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు ఎంతోమంది అలనాటి సినీతారలు హాజరయ్యారు. ఎంజాయ్ చేశారు. హేమమాలిని 75వ బర్త్ డే ఈవెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో స్పెషల్‌గా ఒక వీడియో అందరినీ మరింత ఎక్కువగా ఆకట్టుకుంటోంది. 

క్యా ఖూబ్ లగ్తీ హో..
హేమమాలిని పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసిన అలనాటి తారల్లో రేఖా కూడా ఒకరు. చమ్కీల చీరలో తళుక్కుమన్న రేఖా.. హేమమాలిని కోసం స్టేజ్‌పై స్టెప్పులేశారు. ‘క్యా ఖూబ్ లగ్తీ హో’ అనే పాటకు జోరుగా స్టెప్పులేస్తున్న రేఖాను చూసి హేమమాలిని ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా హేమమాలిని బుగ్గలను గిల్లుతూ, ముద్దులు పెడుతూ తనలోని అల్లరి యాంగిల్‌ను బయటపెట్టారు రేఖా. ఈ బర్త్ డే పార్టీకి మాధురీ దీక్షిత్, రాణీ ముఖర్జీ, శిల్పా శెట్టి, షమితా శెట్టి, జాకీ ష్రాఫ్, ఈషా డియోల్ తదితర ఇతర నటీనటులు కూడా హాజరయ్యారు. అలనాటి తారలంతా కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హేమమాలిని, రేఖాల స్నేహం..
హేమమాలిని, రేఖా.. తాము హీరోయిన్లుగా సినిమాల్లో నటిస్తున్నప్పటి నుండి చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఇప్పటికీ వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ అలాగే ఉండడం విశేషం. ఈ ఇద్దరు ఒకే నెలలో వారి పుట్టినరోజులను కూడా జరుపుకుంటారు. అయితే ఇప్పటికే రేఖా పుట్టినరోజు అయిపోగా.. ఆరోజు ఒక అందమైన పోస్ట్ షేర్ చేసి తనకు బర్త్ డే విషెస్ తెలిపారు హేమమాలిని. ‘ఈరోజు నాకు చాలా స్పెషల్ రోజు, ముఖ్యమైన రోజు. ఎన్నో ఏళ్లుగా నాకు డియర్ ఫ్రెండ్‌గా ఉన్న రేఖా పుట్టినరోజు ఈరోజు. ఈ ఎవర్‌గ్రీన్ లేడీ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చేసింది. ఎంతైనా ఆమెకు మాత్రం సమయం కదలకుండా ఆగిపోయింది, ఆమెకు అసలు వయసు అయిపోదు. నీ జీవితానికి ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్’ అని హేమమాలిని చెప్పుకొచ్చారు.

డ్రీమ్ గర్ల్ హేమమాలిని..
1965లో సినీ పరిశ్రమలో నటిగా అడుగుపెట్టారు హేమమాలిని. కానీ కెరీర్ మొదట్లో సౌత్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడానికి మాత్రమే ఆమెకు అవకాశాలు దక్కాయి. కానీ 1968లో ఒక్కసారిగా రాజ్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్‌తో ‘సప్నో కా సౌదాగర్’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అప్పటినుండి బాలీవుడ్‌లో ఆమెకు డ్రీమ్ గర్ల్‌గా గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులకు హేమమాలిని అంటే డ్రీమ్ గర్లే. గత కొన్నేళ్లుగా సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేకపోయినా.. అప్పుడప్పుడు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నారు హేమమాలిని.

Also Read: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - దసరాకు 'గేమ్ ఛేంజర్' గిఫ్ట్ రెడీ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget