Game Changer Update : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - దసరాకు 'గేమ్ ఛేంజర్' గిఫ్ట్ రెడీ!
Game Changer Song Ram Charan Update : రామ్ చరణ్ అభిమానులకు దసరా సందర్భంగా 'గేమ్ ఛేంజర్' టీమ్ ఓ గిఫ్ట్ రెడీ చేసింది. అది ఏమిటంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ (Shankar Director) దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer). విజయ దశమి కానుకగా మెగా అభిమానుల కోసం ఈ సినిమా యూనిట్ ఓ గిఫ్ట్ రెడీ చేసింది. అది ఏమిటంటే...
దసరాకు 'గేమ్ ఛేంజర్' సాంగ్ రిలీజ్!
Game Changer First Song : 'గేమ్ ఛేంజర్'లో తొలి పాటను దసరాకు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఆ విషయాన్ని టీమ్ అనౌన్స్ చేయలేదు. విజయ దశమికి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. బహుశా... రెండు మూడు రోజుల్లో ఏమైనా చెప్పవచ్చు. సంగీత దర్శకుడు తమన్ ఆల్రెడీ సాంగ్ వర్క్ ఫినిష్ చేశారని తెలిసింది.
శంకర్ దర్శకత్వం వహించిన 'బాయ్స్' సినిమాలో తమన్ ఓ హీరోగా నటించారు. ఆ తర్వాత శంకర్ నిర్మించిన సినిమా 'వైశాలి' (తమిళ సినిమా 'ఈరమ్' తెలుగు అనువాదం)కి తమన్ సంగీతం అందించారు. అయితే... తొలిసారి దర్శకుడిగా శంకర్, సంగీత దర్శకుడిగా తమన్ కలిసి పని చేస్తున్న చిత్రమిది. సాధారణంగా శంకర్ సినిమాల్లో పాటలు భారీ స్థాయిలో చిత్రీకరిస్తారు. అవి సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటాయి. ఈ సినిమాలో పాటలు కూడా అలాగే ఉంటాయని ఫిల్మ్ నగర్ టాక్.
Also Read : రోజాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా - మహేష్‌తో సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్
'ఇండియన్ 2' కోసం శంకర్ చెన్నైలో ఉంటే....
'గేమ్ ఛేంజర్' డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు?
కమల్ హాసన్ 'ఇండియన్ 2', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'... రెండు సినిమాలకూ శంకర్ దర్శకుడు. ఇటీవల 'ఇండియన్ 2' డబ్బింగ్ చెన్నైలో జరిగింది. అందులో శంకర్ ఉన్నారు. ఆ వీడియో విడుదల చేసిన సమయానికి హైదరాబాద్ సిటీలో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ జరుగుతోంది. దాంతో చరణ్ సినిమా షూటింగ్ ఎవరు చేస్తున్నారు? డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు? అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 'గేమ్ ఛేంజర్' సినిమాను శంకర్ మరొకరి చేతిలో పెట్టారనే ప్రచారం కూడా మొదలైంది. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు శంకర్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు.
ఎమోషనల్ సీన్ తీస్తున్నా : శంకర్!
''గేమ్ ఛేంజర్' కోసం హైదరాబాద్ లో ఎమోషనల్ సీన్ తీస్తున్నా'' అని మంగళవారం సాయంత్రం శంకర్ ఓ ట్వీట్ చేశారు. అందులో హీరో రామ్ చరణ్ కూడా ఉన్నారు. అయితే... ఆయన లుక్ మాత్రం రివీల్ చేయలేదు. హీరోకి సీన్ వివరిస్తున్న సమయంలో తీసిన ఫోటోను షేర్ చేశారు. దాంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
Also Read : 'మ్యాన్షన్ 24' రివ్యూ : హాట్‌స్టార్‌లో ఓంకార్ వెబ్ సిరీస్ - భయపెట్టిందా? లేదా?
'గేమ్ ఛేంజర్' సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. మరో నాయికగా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial





















