Ravi Teja: లండన్‌కు బయల్దేరిన రవితేజ, హై బడ్జెట్ థ్రిల్లర్‌కు రెడీ!
రవితేజ, కార్తిక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఈగల్’ కొత్త షెడ్యూల్ లండన్‌లో మొదలయ్యింది.
యంగ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. వాటి రిజల్ట్ గురించి పట్టించుకోకుండా దూసుకెళ్తున్నారు. అందుకే సీనియర్ హీరోలు కూడా వారితో పోటీపడడం కోసం వెంటవెంటనే సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అందులో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు. ఒకప్పుడు రవితేజ మూడేళ్లు గ్యాప్ తీసుకొని కొత్తగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు అందుకున్నా సినిమాలు మాత్రం మెల్లగానే చేశాడు. కానీ గత కొంతకాలంగా రవితేజ పద్ధతి పూర్తిగా మారిపోయింది. వైవిధ్యభరితమైన కథలు వినడం, ఓకే చేయడం, షూటింగ్స్ చకచకా పూర్తి చేయడం, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు కూడా ఈ మాస్ మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ప్రాజెక్ట్స్ షూటింగ్స్‌లో పాల్గొంటూ బాగా బిజీగా ఉన్నాడు.
అప్పుడు ‘ధమాకా’.. ఇప్పుడు ‘ఈగల్’..
రవితేజ, కార్తిక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఈగల్’ కొత్త షెడ్యూల్ లండన్‌లో మొదలయ్యింది. మాస్ మహారాజ్ రవితేజ.. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయడం ఇది రెండోసారి. ముందుగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. ఈ మూవీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మంచి హిట్‌ను అందుకుంది. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా మారిన కార్తిక్ ఘట్టమనేనితో రవితేజ చేస్తున్న చిత్రాన్ని కూడా నిర్మించడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందుకొచ్చింది. ఇప్పటికే ‘ఈగిల్’ నుంచి విడుదలైన చిన్న గ్లింప్స్.. ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచేసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇది మంచి థ్రిల్లర్‌లాగా అనిపిస్తోంది.
ఒకే పాత్రకు ఎన్నో షేడ్స్..
‘ఈగిల్’ సినిమాలోని ముఖ్యమైన పార్ట్‌ను షూట్ చేయడానికి రవితేజతో పాటు మిగతా టీమ్ అంతా లండన్‌కు ప్రయాణమయ్యింది. రవితేజతో పాటు ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న తారాగణం కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గోనుంది. ఇప్పటికే విడుదలయిన గ్లింప్స్ చూస్తుంటే.. రవితేజ పాత్రకు ఇందులో చాలా షేడ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. గ్లింప్స్‌లో చూపించిన విధంగా రవితేజ.. ఒక పెయింటర్‌గా, ఒక రైతుగా.. ఇలా మరెన్నో పాత్రల్లో కనిపించనున్నట్టు అర్థమవుతోంది. ‘ఈగల్’లో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ కనిపించనున్నారు. నవదీప్, మధుబాలా లాంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
2024 సంక్రాంతికి విడుదల..
సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్‌గా మారిన కార్తిక్ ఘట్టమనేని ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అదే విధంగా ‘ఈగిల్’కు కూడా కార్తికే రచయితగా, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా వ్యవహరించాడు. దీంతో పాటు ఎడిటింగ్, సినిమాటోగ్రాఫీ బాధ్యతలు కూడా తనే తీసుకున్నాడు. మొత్తంగా సినిమా క్రాఫ్ట్స్‌లోని చాలావరకు ముఖ్యమైన బాధ్యతలను తనే స్వీకరించాడు. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వివేక్ కుచిబొట్ల దీనికి సహ నిర్మాతగా చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ‘ఈగిల్’ గ్లింప్స్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా అనిపిస్తున్నాయి. ‘ఈగిల్’లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను తన మ్యూజిక్‌తో మరింత థ్రిల్లింగ్ చేయాలనుకుంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ డావ్జంద్. ఇక రవితేజ నటించిన హై బడ్జెట్ ‘ఈగిల్’ 2024 సంక్రాంతి విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
Also Read: నా మోకాళ్లు చూసి అక్షయ్ అవమానించాడు - భానుప్రియ సోదరి శాంతి ప్రియా షాకింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial