By: ABP Desam | Updated at : 21 Aug 2023 01:57 PM (IST)
Photo Credit: Shanthi Priya/Instagram
బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆయన తాజాగా నటించిన 'ఓ మై గాడ్ 2' థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా హీరో అక్షయ్ కుమార్ పై నటి శాంతి ప్రియ షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో అతడితో సినిమా చేస్తున్న సమయంలో తన రంగు గురించి అవమానించేలా మాట్లాడారని వెల్లడించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అక్షయ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది.
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన భానుప్రియకు శాంతిప్రియ స్వయానా చెల్లి అవుతుంది. ఈమె కూడా తెలుగులో పలు సినిమాలు చేసింది. తెలుగుతో పోల్చితే తమిళంతో పాటు హిందీలో ఎక్కువ సినిమాల్లో నటించింది. అక్షయ్ కుమార్, శాంతిప్రియ కలిసి ‘ఇక్కె పె ఇక్కా' అనే సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే అక్షయ్ తనను అవమానించేలా మాట్లాడారని శాంతిప్రియ చెప్పింది. షూటింగ్ లో భాగంగా ఓ రోజు శాంతి ప్రియ మోకాళ్ల పైకి ఉండేలా దుస్తులు ధరించింది. ఆమె మోకాళ్లను చూనసి అక్షయ్ ముందుగా దెబ్బ తగిలిందా? అని అడిగాడట. లేదని చెప్పడంతో అంత నల్లగా ఉన్నాయేంటి? అని కామెంట్ చేశాడట. వెంటనే సెట్స్ ఉన్న వాళ్లంతా నవ్వారని చెప్పింది.
‘ఇక్కె పె ఇక్కా' సినిమా చేసే సమయంలో తనకు 23 ఏండ్లు ఉంటాయని శాంతి ప్రియ చెప్పుకొచ్చింది. అక్షయ్ కామెంట్స్ తర్వాత చాలా బాధపడినట్లు వివరించింది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు చెప్పింది. తాను మాత్రమే కాదు, తన అక్క భానుప్రియ కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు శాంతి ప్రియ వెల్లడించింది. కొన్ని పత్రికలు ఏకంగా భానుప్రియ తన ముఖం మీద ఉన్న మొటిమెలను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటుందంటూ దారుణంగా రాశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన రంగు గురించి దారుణ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్ ఇప్పటికీ సారీ చెప్పలేదని వెల్లడించింది. ఓసారి ఇదే విషయం గురించి తనకు చెప్తే, జోక్ చేశాను అన్నారని చెప్పింది. 1994 నుంచి శాంతి ప్రియ సినిమాలకు దూరం అయ్యింది. 2014లో బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ప్రస్తుతం పలు సీరియల్స్ చేస్తోంది.
ఇక తాజాగా అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2' చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వివాదాల మధ్య విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ చిత్రం కోసం అక్షయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత అజిత్ అంధరే వెల్లడించారు.
Read Also: ఫ్యామిలీ ఫస్ట్ - ఫారిన్ వెకేషన్స్ పై మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Ranbir Kapoor: రణబీర్ కపూర్‌ను విచారించనున్న ఈడీ - ఆ ప్రకటనే కొంప ముంచిందా?
Month Of Madhu: లవ్ బర్డ్స్‌కు ‘మంత్ ఆఫ్ మధు’ బంపర్ ఆఫర్ - ప్రేమికుల కోసం సీక్రెట్ స్క్రీనింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Bhagavanth Kesari: సప్పుడు చెయ్యకురి, నీకన్నా మస్తుగా ఉరుకుతాంది - ‘భగవంత్ కేసరి’ నుంచి బాలయ్య, శ్రీలీలాల సాంగ్ వచ్చేసింది!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
రణ్‌బీర్, యష్ ‘రామాయణం’, రామ్‌చరణ్, ధోని మీటింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !
Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు
Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!
/body>