అన్వేషించండి

Mahesh Babu: ఫ్యామిలీ ఫస్ట్ - ఫారిన్ వెకేషన్స్ పై మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తన ఫారిన్ వెకేషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపరగా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పారు.

ర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. గత నెలలో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి లండన్ వెకేషన్ కు వెళ్లారు ప్రిన్స్. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేశారు.  ఆగష్టు 9న ఆయన 48వ బర్త్ డే వేడుకలు కూడా లండన్ లోనే జరుపుకున్నారు. తాజాగా హైదరాబాద్ కు చేరుకున్న ఆయన ‘గుంటూరు కారం’ మూవీ షూటింగ్ లో బిజీ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.  

ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం- మహేష్ బాబు

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఈ వెంట్ లో పాల్గొన్న ఆయన తన ఫారిన్ వెకేషన్స్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన విదేశీ టూర్ల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ చర్చలన్నీ తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఫ్యామిలీ ఫారిన్ వెకేషన్స్ గురించి జనాలు తెలుసుకుంటున్నారని చెప్పారు.  షూటింగ్‌కి గ్యాప్ వచ్చినప్పుడు, లేదంటే పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు ఫారిన్ టూర్లకు వెళ్లేందుకు ఇష్టపడుతామని చెప్పారు. “మీకు నా ఫారిన్ వెకేషన్ ఫోటోలు నచ్చుతున్నాయా? చాలా మంది అసూయ పడుతున్నట్లు తెలుస్తోంది. నేను మాత్రం ఫ్యామిలీతో వీలైనంత వరకు చక్కటి సమయం గడిపేందుకు ఇష్టపడుతాను. వారు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతాం. వీలు ఉన్నప్పుడైనా వారితో సరదాగా గడపాలనేదే నా కోరిక” అని మహేష్ బాబు తెలిపారు. 

రాజమౌళితో ప్రతిష్టాత్మక చిత్రం

ఇక త్రివిక్రమ్ తో ‘గుంటూరు కారం’ సినిమాతో పాటు దర్శకధీరుడు రాజమౌళితో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. #SSMB29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగుతోంది. ఈ సినిమా ‘ఇండియానా జోన్స్’ త‌ర‌హా అడ్వెంచ‌ర‌స్ మూవీగా ఉండబోతోందని దర్శకుడు రాజ‌మౌళి ఇప్ప‌టికే వెల్లడించారు. ఇదే విషయాన్ని రచయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ సైతం ధృవీకరించారు.

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో ఇండియానా జోన్స్‌ తో పాటు 1981లో విడుద‌లైన సంచలన విజయాన్ని అందుకున్న ‘రైడ‌ర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’ సినిమా లక్షణాలు కూడా ఉండబోతున్నాయట. ఈ అడ్వెంచరస్ చిత్రాన్ని హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌ బ‌ర్గ్ రూపొందించారు. SSMB29కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే కంప్లీట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఈ సినిమాలో కావాల్సినంత థ్రిల్‌, అంతకు మించి ఎమోష‌న్ ఉంటుందన్నారు.  ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్‌లోని అత్యుత్తమ టెక్నీషియన్స్ తో కలిసి పనిచేయడానికి దర్శకుడు రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ  దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Also: గుండులో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ - ఆ మూవీ సీక్వెల్ కోసమే అంటున్న ఫ్యాన్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget