Salman Khan: గుండులో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ - ఆ మూవీ సీక్వెల్ కోసమే అంటున్న ఫ్యాన్స్
తాజాగా సల్మాన్ ఖాన్ కూడా ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో అసలు తన తరువాతి చిత్రం ఏంటి అని అందరిలో అనుమనాలు మొదలయ్యాయి. ఒకవేళ 20 ఏళ్ల క్రితం విడుదలయిన ఒక క్లాసిక్ లవ్ స్టోరీకి ఇది రీమేక్ అయ్యిండవచ్చా?
నటీనటులు అనేవారు చేస్తున్న సినిమాకు, కథకు సూట్ అయ్యే లుక్‌లో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడూ ఒకేలా కనిపించినా కూడా వారి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. పైగా గత కొన్నేళ్లుగా వైవిధ్యభరితమైన సినిమాలు ఎక్కువ అవ్వడంతో దానికి తగినట్టుగా మారిపోవడానికి హీరోలు కూడా వెనకాడడం లేదు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో అసలు తన తరువాతి చిత్రం ఏంటి అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ 20 ఏళ్ల క్రితం విడుదలైన ఒక క్లాసిక్ లవ్ స్టోరీకి ఇది రీమేక్ అయ్యిండవచ్చని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సల్మాన్.. తన కొత్త లుక్‌తో అందరినీ ఆశ్యర్యపరిచాడు.
‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్’ తర్వాత మాయం
సల్మాన్ ఖాన్ ఇటీవల ‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్’ కోసం జుట్టును పొడవుగా పెంచుకున్నాడు. తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చుకున్నాడు. కానీ ఫర్హాద్ సమ్జీ తెరకెక్కించిన ఈ చిత్రం.. అనుకున్నంత రేంజ్‌లో హిట్‌ను అందుకోలేకపోయింది. పైగా ఈ మూవీ విడుదలై ఇప్పటికే నాలుగు నెలలు అవుతున్నా సల్మాన్ తరువాతి చిత్రం గురించి ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు. పైగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ హీరో పెద్దగా ఈవెంట్స్‌లో కూడా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో పూర్తిగా జుట్టును కట్ చేయించుకొని ఒక కొత్త లుక్‌తో వారి ముందుకు వచ్చాడు సల్మాన్.
View this post on Instagram
‘టైగర్ 3’ పూర్తయ్యేది ఎప్పుడు
2003లో విడుదలైన ‘తేరే నామ్’ అనే చిత్రంలో కూడా సల్మాన్‌కు దాదాపుగా జుట్టు ఉండదు. చాలా టైట్ హెయిర్ కట్‌తో ఒక డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తాడు. ఇక 20 ఏళ్ల తర్వాత మరోసారి అదే హెయిర్ కట్‌తో ఫ్యాన్స్ ముందుకు రావడంతో ‘తేరే నామ్ 2’ ప్లాన్ చేస్తున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘త్వరలోనే తేరే నామ్ 2’ అని కూడా వారే డిసైడ్ అయిపోతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ అనే చిత్రంలో నటిస్తున్నాడన్న విషయం మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. గత రెండేళ్లుగా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది. కత్రినా కైఫ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. విలన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ చేస్తున్నాడు. అంతే కాకుండా ‘టైగర్ 3’లో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా ప్లే చేయనున్నట్టు సమాచారం.
‘తేరే నామ్’తో ప్రయోగం
‘టైగర్ 3’ సినిమా ఉందనే విషయం తప్పా చాలాకాలంగా ఈ మూవీ నుంచి ఏ విధమైన అప్డేట్ బయటికి రాలేదు. అయితే సల్మాన్ కొత్త హెయిర్ స్టైల్ చూస్తుంటే ‘టైగర్ 3’ షూటింగ్ పూర్తయ్యిందేమో అన్న అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ఒకవేళ ఆ సినిమా పూర్తయ్యి మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అప్డేట్స్ ఇవ్వవచ్చు కదా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. ‘టైగర్ 3’ తర్వాత సూరజ్ బర్జత్యా దర్శకత్వంలో ‘ప్రేమ్ కీ షాదీ’ అనే చిత్రంలో సల్మాన్ నటిస్తాడని రూమర్స్ వినిపించినా.. అవి ఎంతవరకు నిజం అని ఇంకా తెలియలేదు. ఎప్పుడూ యాక్షన్ సినిమాలే చేస్తూ ఉన్నా.. అప్పుడప్పుడు ‘తేరే నామ్’ లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడానికి కూడా సల్మాన్ ఆసక్తి చూపిస్తాడు. అందుకే ‘తేరే నామ్’కు సీక్వెల్ ప్లానింగ్‌లో ఉంటే అది మరో ప్రయోగాత్మక చిత్రంగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read: జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను: ఇండియన్ డే పెరేడ్‌లో సమంత ఇంట్రెస్టింగ్ స్పీచ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial