Samantha: జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను: ఇండియన్ డే పెరేడ్‌లో సమంత ఇంట్రెస్టింగ్ స్పీచ్
‘ఖుషి’ ఈవెంట్‌లో ఆనందంగా కనిపించిన సమంత.. మరోసారి ఈ ఇండియన్ డే పెరేడ్‌లో కూడా నవ్వులు పూయిస్తూ కనిపించింది.
న్యూయార్క్‌లోని ఇండియన్ డే పెరేడ్‌కు హాజరయ్యింది సమంత. ఇటీవల ‘ఖుషి’ ఈవెంట్‌లో ఆనందంగా కనిపించిన సమంత.. మరోసారి ఈ ఇండియన్ డే పెరేడ్‌లో కూడా నవ్వులు పూయిస్తూ కనిపించింది. అంతే కాకుండా ఇలాంటి ఒక గొప్ప ఈవెంట్‌లో పాల్గొంటున్నందుకు తనకు చాలా గర్వంగా ఉందని తన స్పీచ్‌లో చెప్పుకొచ్చింది.
గర్వంగా కనిపిస్తుంది..
న్యూయార్క్‌లో జరిగే ఇండియన్ డే పెరేడ్ అనేదానికి ప్రతీ ఏడాది సినీ పరిశ్రమ నుంచి ఎవరో ఒక సెలబ్రిటీ అమెరికాకు వెళ్తారు. గతేడాది ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ వెళ్లగా.. ఈ ఏడాది ఆ అవకాశం సమంత దక్కించుకుంది. అందుకే తన అప్‌కమింగ్ మూవీ ‘ఖుషి’ ప్రమోషన్స్‌లో ఎంత బిజీగా ఉన్నా.. సమంత మాత్రం కచ్చితంగా వీలు చూసుకొని ఈ ఈవెంట్‌కు వెళ్లాలనుకుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆన్యువల్ పెరేడ్‌లో పాల్గొంటున్న సమంత వెనుక చాలామంది ఇండియన్, అమెరికన్స్ నడుస్తున్న ఫోటోలు సోషల్ మీడియా అంతటా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ పెరేడ్‌లో ప్రత్యేకంగా పలు మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు కూడా జరిగాయి. వీటన్నింటిలో సమంత చాలా గర్వంగా కనిపిస్తుంది అంటూ ప్రేక్షకులు అనుకుంటున్నారు.
జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను..
ప్రతీ ఏడాది ఆగస్ట్ 20న న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అనేది ఈ ఇండియా పెరేడ్‌ను నిర్వహిస్తుంది. భారత దేశ స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అమెరికాలో ఉన్న భారతీయులు ఏర్పాటు చేసే ఈవెంట్ ఇది. గతేడాది ఈ ఈవెంట్‌కు హాజరయిన అల్లు అర్జున్.. గ్రాండ్ మార్షన్ అనే టైటిల్‌ను కూడా అందుకున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమంత.. ఈ ఏడాది ఇండియా పెరేడ్‌లో పాల్గొనడం భారతీయులు గర్వించదగ్గ విషయం అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ.. ‘ఈరోజు ఇక్కడ ఉండడం చాలా గర్వంగా భావిస్తున్నాను. నా సంస్కృతి, సాంప్రదాయం అనేవి ఎంత గొప్పవో నేను మరోసారి తెలుసుకునేలా చేశారు. నేను ఈరోజు చూసిందంతా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇన్నేళ్లుగా మీరు ఇస్తున్న సపోర్ట్‌కు చాలా థ్యాంక్స్. నా ప్రతీ సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు అమెరికాకు థ్యాంక్స్’ అని తన భావాలను బయటపెట్టింది.
ఊ అంటావా పాటకు క్రేజ్..
సమంత సినిమాలు కేవలం ఇక్కడ మాత్రమే కాదు.. ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్స్‌నే అందుకుంటాయి. ముఖ్యంగా ‘పుష్ప’ చిత్రంలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు ఇక్కడ ఎంత క్రేజ్ లభించిందో.. అమెరికా లాంటి ఫారిన్ దేశాల్లో కూడా అంతే పాపులారిటీ లభించింది. అమెరికాలోని చాలావరకు గ్రాండ్ ఈవెంట్స్‌లో ఈ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. అందుకే అక్కడ కూడా సమంత ఫ్యాన్స్‌కు కరువేమీ లేదు. ఇక ప్రస్తుతం సమంత.. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచాలని అనుకుంటోంది.
Also Read: ‘అందాల ఆడబొమ్మ’ సాంగ్ రీక్రియేట్? ఈసారి కాజల్‌తో బాలయ్య రొమాన్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial