అన్వేషించండి

Rana: ఆ హీరోయిన్‌పై ‘సీరియస్’ కామెంట్స్ - క్షమాపణలు చెప్పిన రానా

తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో రానా చేసిన వ్యాఖ్యలు తనను ఇలాగే చిక్కుల్లో పడేశాయి. అందుకే ఈవెంట్ అయ్యి 24 గంటలు అవ్వకముందే అసలు తను మాట్లాడిన మాటలకు అర్థం ఏంటో క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చాడు.

తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో రానా చేసిన వ్యాఖ్యలు చిక్కుల్లో పడేశాయి. ఈవెంట్ అయ్యి 24 గంటలు అవ్వకముందే అసలు తను మాట్లాడిన మాటలకు అర్థం అది కాదంటూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చాడు.

‘జోయా ఫ్యాక్టర్’ సినిమా గురించే..
ఇటీవల దగ్గుబాటి అబ్బాయి రానా.. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోట’ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరయ్యాడు. ఆ ఈవెంట్‌లో దుల్కర్ ఎలాంటివాడో చెప్తూ.. ఒక బాలీవుడ్ సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ సెట్స్‌లో ఓ హిందీ హీరోయిన్ ఫోన్ పట్టుకొని దుల్కర్ టైమ్ వేస్ట్ చేస్తూ కనిపించిందని, అప్పుడు తనకు కోపం వచ్చి నిర్మాతలపై సీరియస్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ దుల్కర్ కేవలం మూడే స్ట్రెయిట్ హిందీ సినిమాల్లో నటించాడు. అందులో పెద్ద హీరోయిన్ ఉన్న సినిమా అంటే ‘జోయా ఫ్యాక్టర్’ మాత్రమే. ఈ మూవీలో దుల్కర్.. సోనమ్ కపూర్‌తో జతకట్టాడు. దీంతో ప్రేక్షకులు అంతా రానా మాట్లాడింది సోనమ్ కపూర్ గురించే అని ఫిక్స్ అయిపోయారు. అంతే కాకుండా సోనమ్ గురించి కొందరు నెటిజన్లు కామెంట్స్ కూడా పాస్ చేయడం మొదలుపెట్టారు. దీంతో రానా రంగంలోకి దిగక తప్పలేదు.

క్షమాపణలు చెప్తూ ట్వీట్..
‘నా కామెంట్స్ వల్ల సోనమ్‌పై నెగిటివిటీ ఏర్పడడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. అసలు తనపై వస్తున్న నెగిటివిటీలో ఏ మాత్రం నిజం లేదు. నేను మాట్లాడిన మాటలు ఏవీ సీరియస్‌గా కాదు, చాలా సరదాగా అన్నాను. మేము మంచి స్నేహితులుగా ఎప్పుడూ సరదాగా ఉంటాం. అలాంటిది నా మాటలు ఇలా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది. అందుకే ఈ సందర్భంగా నేను సోనమ్‌కు, దుల్కర్‌కు సారీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇలా చెప్పడం వల్ల ఈ మనస్ఫర్థలకు ఒక ముగింపు వస్తుందని అనుకుంటున్నాను. థాంక్యూ’ అంటూ రానా ట్వీట్ చేశాడు. 

రానా తప్పు లేదంటున్న ఫ్యాన్స్..
రానా.. తెలుగు హీరో అయినా కూడా బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు. పైగా సౌత్ తారలతో తనకు ఎలాంటి స్నేహం ఉంటుందో.. బాలీవుడ్‌లో కూడా అలా తనకు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే సోనమ్‌తో తనకు ఉన్న చనువుతోనే ‘కింగ్ ఆఫ్ కోథా’ ఈవెంట్‌లో అలా మాట్లాడాను అంటూ రానా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో సోనమ్‌పై వస్తున్న నెగిటివిటీ కొంతవరకు ఆగిపోయింది. మామూలుగా సినీ సెలబ్రిటీలు ఒకరి పేరు చెప్పకుండా వారిపై కామెంట్స్ చేసినా కూడా వారు ఎవరు అనేది ప్రేక్షకులు కనుక్కోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. అందుకే రానా కామెంట్స్ చేసింది సోనమ్‌పైనే అని తెలుసుకోవడానికి కూడా పెద్దగా సమయం పట్టలేదు. మొత్తానికి ఇందులో రానా తప్పు కూడా ఏమీ లేదని, అనవసరంగా తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.

Also Read: దుల్కర్ టైమ్ వేస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాతలపై రానా ఆగ్రహం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget