Ram The Warriorr Teaser: 'ది వారియర్' టీజర్‌తో రానున్న రామ్, ఊర మాస్ విజువల్స్ చూడటానికి రెడీనా?
రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న 'ది వారియర్' సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది.
![Ram The Warriorr Teaser: 'ది వారియర్' టీజర్‌తో రానున్న రామ్, ఊర మాస్ విజువల్స్ చూడటానికి రెడీనా? Ram Pothineni Krithi Shetty's The Warriorr Teaser to Release on May 14 Ram The Warriorr Teaser: 'ది వారియర్' టీజర్‌తో రానున్న రామ్, ఊర మాస్ విజువల్స్ చూడటానికి రెడీనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/08/1d2be04d76774b225d1acb5990017617_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రామ్ పోతినేని (Ram Pothineni) మాస్ సినిమా చేస్తే థియేటర్లలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చూపించింది. మరి, ఊర మాస్ సినిమా చేస్తే? త్వరలో చూడొచ్చు. తమిళ దర్శకుడు లింగుస్వామితో రామ్ చేస్తున్న సినిమా 'ది వారియర్'. త్వరలో టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మే 14న (శనివారం) సాయంత్రం ఐదు గంటల 31 నిమిషాలకు 'ది వారియర్' టీజర్ (The Warriorr Teaser) విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ తెలిపింది. బుల్లెట్ నడుపుతున్న రామ్ కొత్త స్టిల్ విడుదల చేసింది.
'ది వారియర్' సినిమా నుంచి ఆల్రెడీ రిలీజైన రామ్ లుక్ చూస్తే... కోర మీసం, ఫిట్ బాడీ, పోలీస్ యూనిఫార్మ్‌లో మాసీగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో తమిళ స్టార్ హీరో శింబు పాడిన 'బుల్లెట్...' పాటకూ మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఊర మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.
Also Read: కాజల్ అగర్వాల్ కుమారుడిని చూశారా? ఫస్ట్ ఫొటో బయటకు వచ్చేసింది!
View this post on Instagram
రామ్ సరసన కృతీ శెట్టి (Krithi Shetty) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ప్రభాస్ సినిమాలో దీపికా పదుకోన్‌తో పాటు దిశా పటానీ కూడా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)