Disha Patani In Project K: ప్రభాస్ సినిమాలో దీపికా పదుకోన్‌తో పాటు దిశా పటానీ కూడా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె'లో మరో బాలీవుడ్ భామ దిశా పటానీ నటిస్తున్నారు. ఈ విషయాన్నీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె వెల్లడించారు.

FOLLOW US: 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ 'ప్రాజెక్ట్ కె'. మహానటి విజయం తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే కథానాయిక.‌ ఆమెకు తోడు ఇంకొక బాలీవుడ్ బ్యూటీ కూడా సినిమా ఉన్నారు. ఆమె ఎవరో కాదు దిశా పటానీ.

'ప్రాజెక్ట్ కె' సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని దిశా పటానీ ఇన్ డైరెక్టుగా వెల్లడించారు. శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె ఒక పోస్ట్ చేశారు. అందులో 'ప్రాజెక్ట్ కె' చిత్ర బృందం దిశా పటానీలో వెల్కమ్ చెబుతున్న గ్రీటింగ్ కార్డ్ ఉంది. దాంతో అసలు విషయం తెలిసింది.

తెలుగు ప్రేక్షకులకు దిశా పటానీ తెలిసిన అమ్మాయే. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లోఫర్'లో కథానాయికగా నటించారు. అయితే, ఆ తర్వాత ఆమె హిందీ సినిమాలపై ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. పాన్ ఇండియా సినిమా 'ప్రాజెక్ట్ కె'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, ఇందులో ఆమె పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆల్రెడీ ప్రభాస్, దీపికా పదుకోన్ 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇటీవల షూటింగులో దిశా పటానీ కూడా జాయిన్ అయ్యారు. 

Also Read: అబ్బాయిలు అందంగా ఉంటారని మహేష్‌ను చూశాకే తెలిసింది - సర్కారు వారి పాట ఈవెంట్లో బుచ్చిబాబు ఏమన్నాడంటే?

'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతోందని తెలిసింది.  

Also Read: నాకు బాగా దగ్గరున్నోళ్లు దూరమయ్యారు - ‘సర్కారు వారి పాట’ ఈవెంట్‌లో మహేష్ బాబు భావోద్వేగం

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

Published at : 08 May 2022 10:49 AM (IST) Tags: Prabhas deepika padukone Amitabh bachchan Disha Patani Prabhas new movie Project K movie Disha Patani In Project K Prabhas Updates

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!