Buchibabu Speech: అబ్బాయిలు అందంగా ఉంటారని మహేష్‌ను చూశాకే తెలిసింది - సర్కారు వారి పాట ఈవెంట్లో బుచ్చిబాబు ఏమన్నాడంటే?
సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడారు.

అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని మహేష్ బాబును చూశాకే తనకు తెలిసిందని ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు అన్నారు. సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. 1 నేనొక్కడినే సినిమాకు తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని, అప్పుడే మహేష్ బాబును మొదటిసారి చూశానని అన్నారు.
ఈ ఈవెంట్‌లో బుచ్చిబాబు‘సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు చూడటానికంటే ముందే హిట్ అవుతాయని తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అని ట్రైలర్, పాటలు చూస్తే తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మాతలందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.’
‘మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. కారులో దిగి టీషర్ట్‌లో వచ్చేటప్పుడు మహేష్ బాబుని మొదటిసారి చూశాను. అబ్బాయిలు అందంగా ఉంటారని నాకు ఆరోజే తెలిసింది. అప్పటివరకు ఆడపిల్లలు అందంగా ఉంటారనే భ్రమలో ఉండేవాడ్ని. అది నిజం కాదని అప్పుడే తెలుసుకున్నాను. మీరు (మహేష్ బాబు) ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఎవరి సెట్‌కైనా వెళ్తే షూటింగ్ చూస్తాం. మీ సెట్‌కి వస్తే మిమ్మల్నే చూస్తాం. ధమన్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.’ అన్నారు.
వెంటనే సుమ మైక్ అందుకుని ‘బుచ్చిబాబూ... వేసేశారుగా బాగా.’ అని ఆయనను ఆటపట్టించారు.
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















