Mothers Day 2022: కాజల్ అగర్వాల్ కుమారుడిని చూశారా? మదర్స్ డే రోజున అబ్బాయికి స్పెషల్ నోట్
కాజల్ అగర్వాల్ కుమారుడు నీల్ కిచ్లూను చూశారా? మదర్స్ డే రోజున తన కుమారుడిని ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Kajal Aggarwal shares First photo of baby boy Neil Kitchlu: కాజల్ అగర్వాల్‌కు ఈ ఏడాది మదర్స్ డే ఎంతో స్పెషల్. ఎందుకంటే... తల్లిగా ఆమె సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ మదర్స్ డే కదా! భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడిని ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుమారుడికి ఓ లేఖ కూడా రాశారు.
"డియర్ నీల్... నిన్ను నా పొత్తిళ్లలోకి తీసుకుని, నీ చిన్ని చిన్ని చేతులను నా చేతులతో పట్టుకుని, నీ వెచ్చని శ్వాసను అనుభూతి చెంది, నీ కళ్ళలోకి చూసిన క్షణమే నీతో ప్రేమలో పడ్డాను. నువ్వు నా మొదటి సంతానం, నువ్వు నా మొదటి అబ్బాయి, ప్రతి విషయంలో నువ్వు ఫస్ట్. నువ్వు నాకెంత స్పెషల్ అనేది నీకు తెలియాలని ఉంది. రాబోయే రోజుల్లో నీకు మంచి విలువలు నేర్పిస్తా. తల్లి అంటే ఏంటనేది నువ్వు నాకు నేర్పించావ్. నిస్వార్థంగా ఉండటం నేర్పించావ్. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎంతో తెలిసేలా చేశావ్. నా హృదయంలో ఓ భాగం శరీరం వెలుపల ఉండటం సాధ్యమేనని తెలిసేలా చేశావ్" అని కాజల్ ఎమోషనల్ అయ్యారు.
ఇంకా "నీల్... నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, నువ్వే నాకు ఆకాశంలో కనిపించే నక్షత్రాలు. అది ఎప్పుడూ మర్చిపోకు" అని కుమారుడిపై తన ప్రేమను చాటుకున్నారు కాజల్.
Also Read: ప్రభాస్ సినిమాలో దీపికా పదుకోన్‌తో పాటు దిశా పటానీ కూడా
కాజల్, నీల్ ఫొటో... పోస్ట్ కింద 'నిస్సందేహంగా అందంగా ఉంది' అని సమంత కామెంట్ చేశారు. హీరోయిన్లు రాశీ ఖన్నా, హన్సికా, కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్, స్టయిలిష్ నీరజా కోన తదితరులు లవ్ సింబల్ ఎమోజీలు పోస్ట్ చేశారు.
Also Read: నాకు బాగా దగ్గరున్నోళ్లు దూరమయ్యారు - ‘సర్కారు వారి పాట’ ఈవెంట్‌లో మహేష్ బాబు భావోద్వేగం
View this post on Instagram