By: ABP Desam | Updated at : 23 Jun 2023 01:39 PM (IST)
రామ్ పోతినేని, శ్రీలీల(Photo Credit: Srinivasaa Silver Screen/Instagram)
రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా విడుదల తేదీ విషయంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ‘ది వారియర్’ తర్వాత రామ్, ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతోంది. తెలుగు తో పాటు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యూట్యూబ్ హిందీ డబ్బింగ్‌ల ద్వారా రామ్ ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు రామ్ పోతినేనిపరిచయం అయ్యాడు. ఇక ‘అఖండ’ దేశ వ్యాప్తంగా సంచనల విజయాన్ని అందుకుంది.
బోయపాటి తెరకెక్కించిన పలు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు ఓ రేంజిలో వ్యూస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాకు మంచి ప్రమోషన్ నిర్వహించి, హిందీ మార్కెట్లో సంచలన విజయాన్ని అందుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమిళం మార్కెట్ ను కూడా ఈ సినిమా టార్గెట్ చేయబోతోంది. ఇప్పటికే రామ్ దర్శకుడు లింగుస్వామితో కలిసి ‘ది వారియర్’ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులను బాగానే అలరించింది. తొలుత ప్రకటించిన డేట్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల అయితే, విజయ్, లోకేష్ కనగరాజ్‌ల మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘లియో’తో పోటీ పడే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు డేట్ ముందుకు మారడంలో అక్కడ కూడా కాన్సెంట్రేట్ చేస్తే మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉంది.
ఇక రామ్, బోయపాటి చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ యాక్షన్ చిత్రంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. రామ్, శ్రీలీల జంట సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వాస్తవానికి బోయపాటి సినిమా అంటేనే హీరో క్యారెక్టర్ చాలా మాసీగా ఉంటుంది. యాక్షన్ సీన్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ సినిమాను కూడా తన రేంజికి ఏమాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నారు. రామ్ ను ఈ సినిమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మాసీగా చూపించబోతున్నారట.
ఇక టాలీవుడ్ లో మంచి దూకుడు మీద ఉన్నారు బోయపాటి శ్రీను. గతేడాది నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత రామ్ పోతినేని ఈ సినిమా చేస్తున్నారు. ఇక హీరో రామ్ రీసెంట్ గా ‘వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాపైనే ఆయన అంచనాలు పెట్టుకున్నాడు. ఇక టాలీవుడ్ లో శ్రీలీల మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దానికి తోడు ఆమె ఇటీవల నటించిన ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరిగిపోయింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Jr NTR: నెట్ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
/body>